News April 8, 2025
అనకాపల్లి: ఈ ఏడాది 132 మంది అరెస్ట్

గంజాయి కేసుల్లో ఈ ఏడాది ఇప్పటివరకు 132 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం తెలిపారు. కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. 42 కేసులు నమోదు కాగా 178 మందిని గుర్తించామని కలెక్టర్‌కు వివరించారు. 3,090 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, 53 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పారు.
Similar News
News February 25, 2026
UPDATE: నంద్యాల జిల్లాలో మిద్దె కూలి వృద్ధురాలి మృతి

మట్టి మిద్దె కూలి ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన నందికొట్కూరు మండలం కొణిదెలలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జిలానీ బాషా ఓ మట్టి మిద్దెలో పిండి గిర్ని నడుపుతున్నాడు. లక్ష్మీదేవమ్మ, కురువ సాలమ్మ, మరో ఇద్దరు మహిళలు జొన్నలు పిండి గిర్నిలో వేయించుకునేందుకు అక్కడికి వెళ్లారు. పిండి గిర్ని ఆడుతుండగా కొంత మట్టి మిద్దె పైకప్పు కూలి వృద్ధురాలు మరణించారు. మరో మహిళకు గాయాలయ్యాయి.
News February 25, 2026
భారీగా పెరిగిన ‘బంగినపల్లి’ ధర

AP: ఈ ఏడాది మామిడి రైతులకు అదృష్టం వరించింది. కవర్లు తొడిగిన <<19097565>>బంగినపల్లి<<>> మామిడి టన్ను రేటు ₹1.80 లక్షలు, తోతాపురి ₹లక్ష పైనే పలుకుతున్నాయి. ప్రభుత్వం కవర్లకు 50% రాయితీ ఇస్తుండటంతో ఎక్కువ మంది రైతులు వాడేందుకు ముందుకొస్తున్నారు. దీనివల్ల పండ్ల నాణ్యత రెట్టింపు అయ్యిందని, తెగుళ్లు, పక్షులు, జంతువుల నుంచి రక్షణ లభిస్తోందని అధికారులు చెబుతున్నారు. కాగా రాష్ట్రంలో 10L ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి.
News February 25, 2026
కార్మికులకు గుడ్ న్యూస్: 40 దాటితే హెల్త్ చెకప్!

40 ఏళ్లు దాటిన కార్మికులందరికీ ఇకపై ఫ్రీ మెడికల్ టెస్ట్‌లు తప్పనిసరి కానున్నాయి. ESIC 75వ వేడుకల్లో మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ విషయం చెప్పారు. ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచి రిఫరల్స్ తగ్గించాలని అధికారులకు సూచించారు. అలాగే ఆయుష్మాన్ భారత్ పథకంతో ESICని అనుసంధానించేలా ఒప్పందం చేసుకున్నారు. కార్మికుల ఆరోగ్యం బాగుంటేనే దేశం బాగుంటుందని, ESIC సేవలు ఎయిమ్స్ (AIIMS) స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు.


