News April 8, 2025

అనకాపల్లి: ఈ ఏడాది 132 మంది అరెస్ట్

image

గంజాయి కేసుల్లో ఈ ఏడాది ఇప్పటివరకు 132 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం తెలిపారు. కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. 42 కేసులు నమోదు కాగా 178 మందిని గుర్తించామని కలెక్టర్‌కు వివరించారు. 3,090 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, 53 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పారు.

Similar News

News April 18, 2025

‘గ్రీవెన్స్‌కు వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలి’

image

అనంతపురం కలెక్టరేట్‌లో రెవెన్యూ భవనంలో గురువారం సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల తెగల వారి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన వర్గాల వారి గ్రీవెన్స్‌కు వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.

News April 18, 2025

సూపర్‌హిట్ మూవీ సీక్వెల్‌లో తమన్నాకు ఛాన్స్!

image

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘నో ఎంట్రీ‌’ సీక్వెల్‌లో హీరోయిన్ తమన్నా భాటియా ఛాన్స్ కొట్టేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ మూవీలో యంగ్ హీరోలు అర్జున్ కపూర్, వరుణ్ ధవన్, దిల్జీత్ దోసాంజ్ లీడ్ రోల్స్‌లో నటించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కాగా 2005లో రిలీజైన ‘నో ఎంట్రీ’లో సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, బిపాసా బసు నటించారు.

News April 18, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

image

✓ భూ సమస్యల పరిష్కారానికే భూభారతి: భద్రాద్రి కలెక్టర్ ✓ చర్ల: మావోయిస్టు ప్రాంతాల్లో ఎస్పీ చక్కర్లు ✓ బూర్గంపాడు: గొలుసు దొంగతనానికి పాల్పడిన వ్యక్తికి దేహశుద్ధి ✓ సోలార్ జల వికాసంలో పైలెట్‌గా భద్రాద్రి జిల్లా ✓ అశ్వారావుపేటలో గుండెపోటుతో మహిళ మృతి ✓ కాంగ్రెస్‌కు BRS సభలో బుద్ధి చెబుతాం: రేగా ✓ కొత్తగూడెం కోర్టు ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన ✓ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో టేకులపల్లి వాసికి చోటు.

error: Content is protected !!