News February 23, 2025
అనకాపల్లి: ఈ నెల 25న చికెన్ అండ్ ఎగ్ మేళా

ఈ నెల 25 న ఎన్టీఆర్ స్టేడియంలో చికెన్ అండ్ ఎగ్ మేళా నిర్వహిస్తున్నట్లు నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ తెలిపింది. ఆదివారం స్థానిక విజయరెసిడెన్సీలో జరిగిన విలేకరుల సమావేశంలో కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. బర్డ్ ఫ్లూ పై వస్తున్న వదంతుల నేపథ్యంలో ప్రజల్లో భయాన్ని పోగొట్టేందుకు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మేళ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ మేళాలో పాల్గొంటారని తెలిపారు.
Similar News
News February 24, 2025
BHPL: నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

నేడు జరుగనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లాలో శాసన మండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, జిల్లా యంత్రాంగం ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం తాత్కాలిక రద్దును ప్రజలు గమనించాలని ఆయన సూచించారు.
News February 24, 2025
స్టేషన్ ఘనపూర్: యువత సరైన మార్గంలో ప్రయాణించాలి: ఎంపీ కావ్య

యువత సరైన మార్గంలో ప్రయాణించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఇప్పగూడెం గ్రామానికి చెందిన యువత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న సందర్భంగా ఎంపీని కలిశారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, యువత తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
News February 24, 2025
బైక్ అదుపుతప్పి మందమర్రి వాసి మృతి

మంచిర్యాల జిల్లా మందమర్రి ఫ్లైఓవర్ పైన బైక్ అదుపుతప్పి KK-OCPలారీ డ్రైవర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం..షేక్ ముగ్ధం, షేక్ జిలాని ఇద్దరు అన్నదమ్ములు బైకుపై మంచిర్యాల వెళ్లి వారి మేనమామ ఇంటికి బెల్లం పల్లికి వెళుతుండగా మందమర్రి ఫ్లై ఓవర్ పైన జిలాని డ్రైవింగ్ చేస్తూ డివైడర్‌ను ఢీకొట్టాడు. జిలాని అక్కడికక్కడే మృతి చెందాడు. మగ్గంకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.