News January 30, 2025

అనకాపల్లి: ఉత్తరాంధ్రలో టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లు 21,555 మంది

image

ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లు ప్రస్తుతం 21,555 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో పురుషులు 12,948, మహిళలు 8,607 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం 123 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ప్రతి మండల కేంద్రంలో ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News December 1, 2025

నార్నూర్: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

image

నార్నూర్ మండలంలోని ఉమ్రి గ్రామ వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకొని జాదవ్ నరేష్ (18) ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్సై గణపతి తెలిపారు. జైనూర్ మండలం అందుగూడకు చెందిన సునీత, అన్నాజీ దంపతుల కుమారుడు నరేష్ నాలుగేళ్లుగా పాలేరుగా పని చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో వెళ్లి చూడగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

News December 1, 2025

ఢిల్లీకి మంత్రి లోకేశ్.. రేపు కేంద్ర మంత్రులతో భేటీ

image

AP: మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీ వెళ్లారు. వారికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు స్వాగతం పలికారు. రేపు పార్లమెంట్‌లో కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్‌తో లోకేశ్, అనిత భేటీ కానున్నారు. మొంథా తుఫాను ప్రభావం వల్ల జరిగిన నష్టం అంచనా రిపోర్టును వారికి అందిస్తారు.

News December 1, 2025

అమరావతిని ఉద్యోగాల కల్పనకు కేంద్రంగా మారుస్తా: CM

image

అమరావతిని ఉద్యోగాల కల్పనకు కేంద్రంగా మారుస్తున్నామని, మొదటి దశ పనులు 2028 నాటికి పూర్తవుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం ఉంగుటూరు(M) నల్లమాడు సభలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం మరో 15-20 ఏళ్లు అధికారంలో ఉండాలని ఆకాంక్షించారు. గత పాలకుల ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి ఊసే లేదని విమర్శించారు.