News March 4, 2025
అనకాపల్లి ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా విడుదల

అనకాపల్లి జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను విడుదల చేసినట్లు డీఈవో అప్పారావు నాయుడు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ ఆధారంగా జాబితాను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ జాబితాను తమ కార్యాలయం నోటీస్ బోర్డులో ఉంచామన్నారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 10వ తేదీలోగా తెలియజేయాలన్నారు.
Similar News
News April 14, 2026
HYDలో భారీ మోసం.. ఇద్దరు అరెస్ట్

నగరంలో విదేశీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న భారీ మోసాన్ని జూబ్లీహిల్స్ పోలీసులు బట్టబయలు చేశారు. యూరప్ దేశాల్లో ఉద్యోగాలంటూ ఒక్కో వ్యక్తి నుంచి రూ.4 నుంచి 5 లక్షలు వసూలు చేస్తున్న ‘ట్రివియల్ చాప్టర్’ సంస్థకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ప్రకటనలు, నకిలీ ఆఫర్ లెటర్లతో ఈ ముఠా మోసాలకు పాల్పడుతోంది. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
News April 14, 2026
ఆలేరు: పాన్ మసాలా చోరీ కేసును ఛేదించిన పోలీసులు

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తరలుతున్న రూ.కోటి విలువైన ‘ఓ పాన్ మసాలా’ లోడుతో అదృశ్యమైన కంటైనర్ కేసును ఆలేరు పోలీసులు ఛేదించారు. ఏప్రిల్ మొదటి వారంలో కంటైనర్ అదృశ్యంపై ఢిల్లీకి చెందిన వినోద్ ఉపాధ్యాయ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ యాలాద్రి తెలిపారు. సాంకేతిక ఆధారాలతో వేగంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నట్లు పేర్కొన్నారు.
News April 14, 2026
చమురు భగభగతో భారత్ జీడీపీకి ఎఫెక్ట్: S&P

చమురు ధరల భగభగ నేపథ్యంలో మరో ఏజెన్సీ భారత్ GDP గ్రోత్‌పై తన అంచనాలు ప్రకటించింది. ఈ ఏడాది బ్యారెల్ ధర సగటున 130 డాలర్లుగా కొనసాగితే FY27లో గ్రోత్ 0.8% తగ్గొచ్చని S&P గ్లోబల్ రేటింగ్స్ వెల్లడించింది. FY27లో భారత్ జీడీపీ గ్రోత్ 7.1% ఉండొచ్చని గత నెల అంచనా వేసింది. ఇటీవల మోర్గాన్ స్టాన్లీ <<19592068>>సంస్థ<<>> కూడా మూడు నెలల పాటు చమురు ధర $150 వద్ద కొనసాగితే గ్రోత్ రేట్ 5.7%కే పరిమితమవుతుందని పేర్కొంది.


