News March 25, 2024

అనకాపల్లి ఎంపీ అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్

image

అనకాపల్లి ఎంపీ స్థానానికి ఎన్డీఏ అభ్యర్థిగా సీఎం రమేశ్‌ను ఖరారు చేయగా.. వైసీపీ అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ నియోజకవర్గంలో కాపు, గవర సామాజిక వర్గాలదే పైచేయి. అయితే ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేశ్ వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు.. వైసీపీలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారే. మరి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ఎవరు బరిలో ఉంటారని మీరు భావిస్తున్నారు..? 

Similar News

News February 7, 2025

కేజీహెచ్‌లో బాలిక ప్రసవం.. మరణించిన శిశువు

image

కేజీహెచ్‌లో <<15384408>>బాలిక ప్రసవించిన <<>>ఘటనలో విషాదం చోటుచేసుకుంది. నెలలు నిండకముందే ఆరునెలల మగబిడ్డకు జన్మనివ్వగా ఆ శిశువు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆ బాలిక భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కళాశాలలో చదువుతుంది. ప్రేమ పేరుతో శారీరకంగా కలిసిన ఓ యువకుడు ఆమెను గర్భవతి చేశాడు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి చీడికాడ స్టేషన్‌కు కేసు బదిలీ చేసినట్లు భీమిలి సీఐ సుధాకర్ తెలిపారు.

News February 7, 2025

విశాఖ బీచ్ రోడ్డులో మురీ మిక్చర్ తింటున్నారా?

image

విశాఖ బీచ్ రోడ్డులో మురీ మిక్చర్‌ తీనేవారికి చేదువార్త. న్యూస్ పేపర్‌లో మురీమిక్చర్ తింటే క్యాన్సర్ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జి.ఏ.బి నందాజీ తెలిపారు. ఈ మేరకు మురీ మిక్చర్ అమ్మె చిరు వ్యాపారులకు గురువారం అవగాహక కల్పించారు. ప్రింటింగ్ న్యూస్ పేపర్లో అమ్మకాలు పూర్తిగా నిలిపివేయాలని వారికి సూచించారు. ఎఫ్ఎస్ఐ మార్కు ఉన్న పేపర్‌ప్లేట్లు వినియోగించాలన్నారు.

News February 7, 2025

కేజీహెచ్‌లో బాలిక ప్రసవం

image

కేజీహెచ్‌లో 17 ఏళ్ల బాలిక ప్రసవించిన ఘటన గురువారం చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లాకు చెందిన బాలిక భీమిలిలోని ఓ హాస్టల్‌లో చదువుతోంది. కడుపునొప్పి రావడంతో కేజీహెచ్‌లో చేర్పించగా నెలలు నిండని మగబిడ్డ పుట్టి.. చనిపోయినట్లు సమాచారం. ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు విచారణ చేస్తున్నారు. ఓ యువకుడు పెళ్లి పేరుతో ఆమెకు దగ్గరైనట్లు గుర్తించారు.

error: Content is protected !!