News February 28, 2025
అనకాపల్లి: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీకి రూ.107.46 కోట్లు

అనకాపల్లి జిల్లాలో మార్చి నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్‌ల పంపిణీకి ప్రభుత్వం రూ.107.46 కోట్లు విడుదల చేసినట్లు డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శశీదేవి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2,56,272 మంది లబ్ధిదారులకు శనివారం పెన్షన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయ సిబ్బంది బ్యాంకుల నుంచి పెన్షన్ సొమ్ము డ్రా చేస్తారన్నారు.
Similar News
News March 21, 2025
నిర్మల్: పది పరీక్షకు ఏడుగురు విద్యార్థులు గైర్హాజరు

నిర్మల్ జిల్లాలో శుక్రవారం నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో ఏడుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి రామారావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9,122 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 9,115 మంది పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు. కాగా జిల్లా వ్యాప్తంగా 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
News March 21, 2025
ఆయుష్ భవనం వినియోగించడానికి అవకాశం కల్పించాలి: కలెక్టర్

నర్సింగ్ విద్యార్థులకు తరగతులు నిర్వహణకు తాత్కాలికంగా ఆయుష్ భవనం వినియోగించడానికి అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో వైద్య, నర్సింగ్, ఆయుష్, సీహెచ్‌సీ, టీజీఎంఎస్ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు .కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయుష్ భవనంలోని రెండు అంతస్థులను నర్సింగ్ కళాశాల నిర్వహణకు కేటాయించాలని కలెక్టర్ సూచించారు.
News March 21, 2025
భూపాలపల్లి జిల్లాలో 3,441 మంది విద్యార్థులు హాజరు

భూపాలపల్లి జిల్లాలోని 20 పరీక్షా కేంద్రాల్లో శుక్రవారం ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యం.రాజేందర్ తెలియజేశారు. 3,449 విద్యార్థులకు 3,441 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు వారు తెలిపారు. పరీక్ష కేంద్రాలలో వైద్యం, కరెంటు, రవాణా సౌకర్యాలు తదితర మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.