News March 6, 2025
అనకాపల్లి ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మీ కామెంట్

అనకాపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న తరుణంలో అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీ వేదికగా ఆయన మాట్లాడుతూ.. నక్కపల్లిలో ఏర్పాటు అయ్యే మిట్టల్ స్టీల్ ప్లాంట్లో లక్ష ఉద్యోగ అవకాశాలు ఉండగా కనీసం 20వేల ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలన్నారు. మరి కొణతాల వ్యాఖ్యలపై మీ కామెంట్.
Similar News
News March 7, 2025
30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ: మంత్రి పొంగులేటి

TG: ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా 90 పోస్టులు మంజూరు చేశామని చెప్పారు. 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలతో HMDAను విస్తరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. HMDA పరిధిలో కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు ఏర్పాటు చేస్తామన్నారు.
News March 7, 2025
మహిళా సదస్సు ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి సమీక్ష

ఈ నెల 8న పరేడ్ గ్రౌండ్లో జరగనున్న మహిళా సదస్సు ఏర్పాట్లను బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సదస్సు అవసరమైన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, వసతులు తదితర అంశాలను చర్చించారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులకు బైసన్పోల్ మైదానంలో పార్కింగ్ ఏర్పాటు చేయాలని, మహిళలకు మజ్జిగప్యాకెట్లు అందించాలన్నారు.
News March 7, 2025
త్వరలో ఉచిత ఆన్లైన్ డీఎస్సీ కోచింగ్: మంత్రి

AP: బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో త్వరలో ఉచిత ఆన్లైన్ డీఎస్సీ కోచింగ్ ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ నెల 10 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. BC, EWS అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని, టెట్లో ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ జిల్లాలకు చెందిన బీసీ సంక్షేమ శాఖాధికారులను సంప్రదించాలని మంత్రి వివరించారు.