News February 8, 2025

అనకాపల్లి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఎవరికి?

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఎవరికిస్తుందనే విషయంపై గందరగోళం నెలకొంది. ప్రస్తుత MLC పాకలపాటి రఘువర్మ నామినేషన్ వేసిన సందర్భంగా TDP ఎమ్మెల్సీ చిరంజీవిరావు మాట్లాడుతూ కూటమి మద్దతు రఘువర్మకేనని ప్రకటించారు. అయితే పీఆర్టీయూ, STUల మద్దతుతో పోటీ చేస్తున్న గాదె శ్రీనివాసులు నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్ శుక్రవారం హాజరై మద్దతు ప్రకటించారు.

Similar News

News December 9, 2025

నకిలీ కాల్ సెంటర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణరావు నకిలీ కాల్ సెంటర్ల మోసాలపై ప్రజలను అప్రమత్తం చేశారు. తెలియని కస్టమర్ కేర్ నంబర్లను నమ్మవద్దని, అధికారిక వెబ్‌సైట్లలోనే వివరాలు చూడాలని సూచించారు. ఓటీపీ, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పరాదని స్పష్టం చేశారు. మోసపోయిన వారు వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.

News December 9, 2025

మంగళగిరి: సీకే హైస్కూల్ ఈసారైనా రాణిస్తుందా?

image

మంగళగిరిలో ఏళ్ల చరిత్ర కలిగిన CKహైస్కూల్ విద్యార్థులు ఈసారైనా టెన్త్ ఫలితాల్లో రాణిస్తారా అనేది వేచి చూడాలి. గతంలో ఈ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి మార్కులతో సత్తా చాటేవారు. కొన్నేళ్లుగా ర్యాంకుల సంగతి అటుంచితే ఉత్తీర్ణత శాతమే భారీగా పడిపోతూ వస్తోంది. ప్రస్తుతం విద్యాశాఖ అమలు చేస్తున్న 100రోజుల ప్రణాళికను టీచర్లు పటిష్ఠంగా అమలు చేసి మంచి ఫలితాలు రాబట్టాలని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు.

News December 9, 2025

మంచిర్యాలలో విషాదం

image

మంచిర్యాలలోని ఏసీసీ సిమెంట్ కంపెనీ సమీపంలో సోమవారం రాత్రి రైలు కింద పడి సాగె శ్రీనివాస్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హాజీపూర్ మండలం రాపల్లికి చెందిన శ్రీనివాస్ ఏసీసీలో ఇంటర్‌నెట్ షాప్ నిర్వహిస్తున్నాడు. పిల్లలు పుట్టడం లేదని బాధతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఈ మేరకు జీఆర్పీ ఎస్ఐ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ తెలిపారు.