News March 17, 2025
అనకాపల్లి: ఎస్పీ పరిష్కార వేదికకు 40 ఫిర్యాదులు

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 40 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, మోసపూరిత వ్యవహారాలు వంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. జిల్లా అదనపు ఎస్పీ మోహన రావు స్వయంగా ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను పరిశీలించారు. సంబంధిత పోలీసు అధికారులకు తక్షణ విచారణ జరిపి సత్వర పరిష్కారం కల్పించాలన్నారు.
Similar News
News March 18, 2025
చిట్యాల: అమ్మ జ్ఞాపకంగా పూల వనం!

అమ్మ అనే భావం అనిర్వచనీయానికి నిర్వచనంగా పూలవనాన్ని అమ్మ జ్ఞాపకంగా ఏర్పాటు చేశారు ముగ్గురు కుమారులు. బృందావనాన్ని తలపించేలా పూల వనంలో పక్షులకు ఆహారం, నీరును అందించి అమ్మ ప్రేమను జీవాలకు సైతం చాటుకుంటున్నారు. చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన మెరుగు పద్మ కొన్ని నెలల క్రితం మరణించారు. తల్లిని మించిన దైవం లేదనడానికి నిదర్శనంగా అమ్మ జ్ఞాపకాలను కుమారులు ఇలా అపారంగా ఆరాధిస్తున్నారు.
News March 18, 2025
NZB: స్నేహితుడి ఇంట్లో దావత్.. గొడ్డలితో ATTACK

తాగిన మైకంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన వాగ్వాదం గొడ్డలితో వేటు వరకు దారితీసింది. ఈ ఘటన మాక్లూర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కల్లెడ గ్రామానికి చెందిన దేవతి పోశెట్టి అనే వ్యక్తి సోమవారం దుబాయ్ వెళ్లాల్సి ఉండగా, తన స్నేహితుడైన తెడ్డు లింగం ఇంట్లో దావత్ ఇచ్చాడు. దేవతి పోశెట్టి, తెడ్డు లింగం ఇద్దరికి మద్యం మత్తులో గొడవ జరిగింది. దీంతో లింగం, పోశెట్టిపై గొడ్డలితో దాడిచేశాడు
News March 18, 2025
సంగారెడ్డి: టెన్త్ పరీక్షల పరిశీలన అధికారిగా ఉషారాణి

ఈ నెల 21 నుంచి సంగారెడ్డి జిల్లాలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల పరిశీలన అధికారిగా ఉషారాణి నియమితులయ్యారు. హైదరాబాద్లోని వయోజన విద్యా శాఖలో డైరెక్టర్గా పని చేస్తున్న ఉషారాణిని నియమిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని DEO వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షలు పూర్తయ్యే వరకు జిల్లాలోని పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తారని పేర్కొన్నారు.