News July 13, 2024

అనకాపల్లి: కోడిపెట్ట తల కొరికిన డాన్సర్.. కేసు

image

అనకాపల్లిలో ఓ డ్యాన్సర్ నృత్య ప్రదర్శన చేస్తూ కోడిపెట్ట తలను కొరికివేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో పెటా సంస్థ (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్) ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నృత్య ప్రదర్శనలో జనసందోహం ముందు ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కోడి తలను తన పళ్లతో కొరికి చంపాడని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ సంస్థ ఫిర్యాదు చేసింది.

Similar News

News November 28, 2025

రేపు విశాఖ రానున్న పవన్ కళ్యాణ్

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖలో నిర్వహించే నేవీ డే ముందస్తు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. శనివారం సాయంత్రం సముద్రికలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. డిసెంబర్ 4న నేవీ డేకి సంబంధించి ముందస్తు కార్యక్రమాలు విశాఖలో చేపట్టారు. పవన్ కళ్యాణ్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి షీలా నగర్.. మారుతీ జంక్షన్ మీదుగా ఈస్టర్న్ నావల్ కమాండ్‌కు చేరుకుంటారు.

News November 28, 2025

శ్రీహరిపురంలో యువకుడు ఆత్మహత్య

image

శ్రీహరిపురంలోని తన ఇంట్లో ఓ యువకుడు వంశీ ఫ్యానుకు ఊరివేసుకుని తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. మల్కాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్కాపురం సీఐ గొల్లగాని అప్పారావు తెలిపారు.

News November 27, 2025

విశాఖ: అవినీతి పోలీసుల వేటకు రంగం సిద్ధం?

image

విశాఖలోని పోలీస్ శాఖలో అవినీతిపై సీరియస్ అయిన CP శంఖబ్రత బాగ్చీ భారీగా బదిలీలు చేపట్టారు. ఇటీవల నలుగురు SIలను బదిలీ చేసిన ఆయన, నేడు మరో 37 మంది ASIలు, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుళ్లను ఒకేసారి బదిలీ చేశారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది అవినీతి, నెల మామూలు వసూళ్లు, నేరస్తులకు సమాచారం చేరవేయడం వంటి ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో సీఐలపై కూడా వేటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.