News February 5, 2025

అనకాపల్లి: ‘క్యాన్సర్ పట్ల భయాందోళనలు వద్దు’

image

క్యాన్సర్ పట్ల భయాందోళనలు వద్దని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినం సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం విశాఖలో నిర్వహించిన పబ్లిక్ ఔట్‌రీచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్యాన్సర్ రాకుండా తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలను వైద్యులు ప్రజలకు వివరించాలన్నారు.

Similar News

News November 6, 2025

గద్వాల్: నేడు నుంచి యథావిధిగా పత్తి కొనుగోలు ప్రక్రియ

image

రాష్ట్ర వ్యాప్తంగా మిల్లుల యజమానులు తలపెట్టిన సిసిఐ కొనుగోళ్ల బంద్ ను ఉపసంహరించుకోవడం జరిగిందని కలెక్టర్ సంతోష్ గురువారం తెలిపారు. అందులో గద్వాల జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుంచి యథావిధిగా పత్తి కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిన్నింగ్ మిల్లుల యజమానులు కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.

News November 6, 2025

మాలేపాటి కుటుంబానికి లోకేశ్ పరామర్శ

image

దగదర్తిలోని మాలేపాటి నివాసానికి మంత్రి నారా లోకేశ్ చేరుకున్నారు. సుబ్బానాయుడు, భాను చిత్రపటాలకు మంత్రి నివాళులు అర్పించారు. అనంతరం మాలేపాటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైరంగా ఉండాలని సూచించారు. టీడీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని లోకేశ్ భరోసా ఇచ్చారు. లోకేశ్ వెంట నెల్లూరు జిల్లా MLAలు ఉన్నారు.

News November 6, 2025

విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ జానకి రామయ్య మృతి

image

విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ మండవ జానకి రామయ్య (93) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం గన్నవరం శివారు రుషి వాటిక వృద్ధుల నిలయంలో తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ కాలం విజయ డెయిరీ ఛైర్మన్‌గా సేవలందించిన మండవ, పాడి రైతుల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.