News February 5, 2025
అనకాపల్లి: ‘క్యాన్సర్ పట్ల భయాందోళనలు వద్దు’

క్యాన్సర్ పట్ల భయాందోళనలు వద్దని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినం సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం విశాఖలో నిర్వహించిన పబ్లిక్ ఔట్‌రీచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్యాన్సర్ రాకుండా తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలను వైద్యులు ప్రజలకు వివరించాలన్నారు.
Similar News
News February 17, 2025
అరకు: క్వెస్ట్‌లో విజేతలకు నగదు బహుమతి

అల్లూరి జిల్లా అరకు చలి ఉత్సవంలో ది గ్రేట్ అరకు క్వెస్ట్‌లో గెలుపొందిన విజేతలకు పాడేరు కలెక్టరేట్లో కలెక్టర్ దినేష్ కుమార్ నగదు బహుమతి ఆదివారం అందించారు. ప్రథమ స్థానంలో నిలిచిన ధ్రువ అండ్ టీమ్‌కు రూ. 50,000, ద్వితీయ స్థానంలో ఉన్న మంగతల్లి టీమ్‌కు రూ. 30,000, తృతియ బహుమతి రూ. 20,000లను భాస్కర్ రెడ్డి టీమ్‌కి అందజేశారు. మ్యూజియం క్యూరేటర్ వి మురళి, ఆయా బృంద సభ్యులు పాల్గొన్నారు.
News February 17, 2025
హనుమకొండ: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డైరెక్టర్

ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు మెరుగ్గా అందించడం ద్వారా ప్రజలకు వైద్య పరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్ సూచించారు. ఆదివారం ఆయన జిల్లాలోని దామెర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలోని ల్యాబ్ ఫార్మసీ వ్యాక్సిన్ స్టోర్, ఆయుష్, ఎన్సీడీ, ఇతర విభాగాలను పరిశీలించారు.
News February 17, 2025
తిరుపతిలో ముగ్గురు ముఖ్యమంత్రుల పర్యటన

తిరుపతిలో ఇవాళ నుంచి మూడు రోజుల పాటు అంతర్జాతీయ దేవాలయాల సదస్సు మంగళం సమీపంలో జరగనుంది. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులతోపాటు ఏపీ సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా సబ్ కలెక్టర్ శుభం బన్సల్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, కమిషనర్ మౌర్య తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.