News March 7, 2025
అనకాపల్లి: క్వారీలపై ఫిర్యాదుల మేరకు విచారణ

జిల్లాలోని రాయి క్వారీలపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న తనిఖీలపై గనుల శాఖ విజిలెన్స్ ఏడీ అశోక్‌కుమార్ రాయి క్వారీలపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయని, గనుల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో క్వారీల్లో తనిఖీలు జరుపుతున్నామన్నారు. అనుమతి లేని క్వారీలను సీజ్ చేసి, అదనంగా తవ్వకాలు జరిపిన క్వారీల నిర్వాహకులకు జరిమానాలు విధించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నామన్నారు.
Similar News
News March 10, 2025
సంగారెడ్డి జిల్లాలో 122 టెన్త్ పరీక్ష కేంద్రాలు

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 21 నుంచి జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు 122 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సంవత్సరం 22,411 మంది విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
News March 10, 2025
MHBD: డోర్నకల్‌కు యంగ్ ఇండియా గురుకులం

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలల నిర్మాణానికి రూ.11 వేల కోట్లను విద్యాశాఖ మంజూరు చేసింది. 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురుకుల పాఠశాలల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఒక్కో స్కూల్‌కు రూ.200 కోట్లు చొప్పున పరిపాలన అనుమతులను మంజూరు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గంలో ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
News March 10, 2025
PHOTOS: ట్రోఫీతో క్రికెటర్లు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని నెగ్గి భారత జట్టు 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ధోనీ సారథ్యంలో 2013లో గెలిచాక 2017లోనూ అవకాశం వచ్చినా ఫైనల్లో పాక్ చేతిలో ఓటమి పాలైంది. అయితే ఈ సారి వచ్చిన ఛాన్స్‌ను రోహిత్ సేన ఒడిసిపట్టుకుంది. హిట్ మ్యాన్ నాయకత్వంలో సమిష్టిగా రాణిస్తూ ఒక్క ఓటమి లేకుండా కప్పును అందుకుంది. ఈ క్రమంలో కప్పుతో క్రికెటర్లు ఫొటోలకు పోజులిచ్చారు.