News March 22, 2025
అనకాపల్లి: గంజాయి అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలి:డీఐజీ

విశాఖ రేంజ్ పరిధిలో గంజాయి రవాణాకు చర్యలు తీసుకోవాలని డీఐజీ గోపీనాథ్ ఆదేశించారు. శనివారం రేంజ్ కార్యాలయం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి నిందితులను అరెస్ట్ చేసి, ఆస్తులు జప్తు చేయాలని సూచించారు. గంజాయి వినియోగదారులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు.
Similar News
News December 1, 2025
ఇకపై అన్ని ఫోన్లలో ప్రభుత్వ యాప్.. డిలీట్ చేయలేం!

దేశంలో నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు మొబైల్ తయారీ సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలిచ్చినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. ఇకపై తయారయ్యే ఫోన్లలో తప్పనిసరిగా ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ యాప్ ‘సంచార్ సాథీ’ని డిఫాల్ట్‌గా ఇవ్వాలని స్పష్టం చేసినట్లు తెలిపింది. ఈ యాప్‌ను డిలీట్ చేయలేరు. ఇందుకు 90 రోజుల గడువు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ అంశంపై అటు ప్రభుత్వం, ఇటు మొబైల్ కంపెనీలు అధికారికంగా స్పందించలేదు.
News December 1, 2025
జగిత్యాల: గ్రీవెన్స్ డేలో అర్జీదారులకు భరోసా ఇచ్చిన ఎస్పీ

ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈ రోజు జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో అశోక్ కుమార్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 5మంది అర్జీదారుల ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు పోలీస్ శాఖను చేరువ చేస్తూ, ఫిర్యాదులపై వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరుగునట్లు చూడాలని తెలిపారు.
News December 1, 2025
‘చిన్నస్వామి’ సేఫ్టీ క్లియరెన్స్ కోరిన ప్రభుత్వం

RCB ర్యాలీలో తొక్కిసలాట నేపథ్యంలో వచ్చే IPLకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచులు జరగడంపై సందిగ్ధత నెలకొంది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌కు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చింది. స్టేడియం సేఫ్టీ రిపోర్ట్ సమర్పించాలని కోరింది. ఆ నివేదిక నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ నుంచి సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్‌తో ప్రిపేర్ చేయించాలని ఆదేశించింది.


