News February 4, 2025

అనకాపల్లి: గణనీయంగా తగ్గిన టమాటా ధరలు

image

గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో సోమవారం జరిగిన వారపు సంతలో టమాటా ధర కిలో రూ.5కు పడిపోయింది. 30 కిలోల క్రేట్ టమాటాల ధర రూ.140 నుంచి రూ.150 పలికింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు టమాటాలను తీసుకురావడంతో ధరలు గణనీయంగా తగ్గిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. ఇదే విధంగా ధరలు కొనసాగితే పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News November 22, 2025

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్స్ జీవో విడుదల

image

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో 46ను విడుదల చేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని జీవోలో స్పష్టం చేసింది. SC, ST, BC, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అమలు చేయనుంది. ST రిజర్వేషన్లు ఖరారయ్యాక SC, BC రిజర్వేషన్లు ఉంటాయి. రేపు సా.6 గంటల్లోపు ఖరారు చేసిన రిజర్వేషన్లను పంచాయతీరాజ్ శాఖకు కలెక్టర్లు అందించనున్నారు.

News November 22, 2025

చిన్న కాళేశ్వరంపై కలెక్టర్ సమీక్ష

image

చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పంట కాలువల భూసేకరణ, సర్వే ప్రగతిపై కలెక్టర్ రాహుల్ శర్మ ఐడీఓసీ కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. కాలువల నిర్మాణానికి ఎంత భూమి అవసరం, ఎంత మంది రైతులు భూములు కోల్పోయారు అనే అంశాలపై చర్చించారు. కాలువల నిర్మాణం వేగంగా సాగేందుకు, అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు.

News November 22, 2025

ఇంజినీరింగ్ విద్యార్థినులకు JNTU హైదరాబాద్ గొప్ప అవకాశం

image

బీటెక్​ చదివిన ప్రతి విద్యార్థినికి ఉద్యోగం రావాలని JNTU హైదరాబాద్​ అధికారులు కొత్త ఆలోచనను అమల్లోకి తీసుకొచ్చారు. క్యాంపస్​ ఇంటర్వ్యూల్లో కొద్దిపాటి తేడాతో ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన విద్యార్థినులకు ఆరు నెలలు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు సాధించేందుకు సాయం చేయనున్నారు. ఇందుకోసం బెంగళూరులోని ఎమర్టెక్స్​ అనే ఐటీ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. JNTUలో చదివితే ఉద్యోగం ఖాయం అనే ధీమాను కల్పిస్తున్నారు.