News March 3, 2025
అనకాపల్లి: గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపు ప్రభుత్వానికి షాక్

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసుల నాయుడు గెలుపొందడంతో ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ గెలుపుlకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఓటర్లను కలిసి గెలుపు కోసం కృషి చేశారు. అయితే అనుహ్యంగా శ్రీనివాసులi నాయుడు విజయం సాధించడంతో కూటమి నాయకులు ఖంగు తిన్నారు.
Similar News
News November 13, 2025
రాప్తాడులో బాలుడిపై లైంగిక దాడి

రాప్తాడు(M)లో బాలుడిపై లైంగికదాడి జరిగింది. కళ్యాణదుర్గం(M)లోని ఓ గ్రామానికి చెందిన బాలుడు నానమ్మ దగ్గర ఉంటూ 8వ తరగతి చదువుతున్నాడు. వారంక్రితం అమ్మమ్మ దగ్గరికొచ్చాడు. శనివారం RDT స్టేడియంలో క్రీడాపోటీలను స్నేహితులతో కలిసిచూశాడు. ఇంటికి వస్తుండగా చిన్మయనగర్‌కు చెందిన ముగ్గురు పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు గురిచేశారని CI శ్రీహర్ష తెలిపారు. బాలుడి వివరాల మేరకు పోక్సో కేసు నమోదు చేశామన్నారు.
News November 13, 2025
‘పీక్ కోల్డ్‌వేవ్’: తెలంగాణపై చలి పంజా!

రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. ఈరోజు నుంచి ‘పీక్ కోల్డ్‌వేవ్’ పరిస్థితులు ప్రారంభం కానున్నాయి. రాత్రి, ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు 10°C-8°C వరకు పడిపోయే అవకాశం ఉంది. ఈనెల 18 వరకు ఇది కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోనూ టెంపరేచర్ 13°C-11°Cకి పడిపోతుందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా వెచ్చని దుస్తులు ధరించాలని హెచ్చరిస్తున్నారు.
News November 13, 2025
నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి

మేడారం సమ్మక్క, సారలమ్మల జాతర అభివృద్ధిలో భాగంగా Y జంక్షన్ నుంచి జంపన్న వాగు వరకు చేపట్టిన నాలుగు లైన్ల రోడ్డు, డివైడర్, ప్లాంటేషన్ పనులను నెల రోజుల్లోపు పూర్తి చేయాలని మంత్రి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మేడారంలో పర్యటించిన మంత్రి, జాతర సమీపిస్తున్నందున పనుల వేగాన్ని పెంచాలన్నారు.


