News February 26, 2025
అనకాపల్లి: చట్ట విరుద్ధమైన సమావేశాలపై నిషేధం

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27న జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు అనకాపల్లి జిల్లాలో చట్టవిరుద్ధమైన సమావేశాలు, ర్యాలీలను నిషేధించినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ ప్రకటించారు. అలాగే లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదన్నారు. పోలింగ్ స్టేషన్కు 200 మీటర్ల దూరంలో ఐదుగురు కంటే ఎక్కువమంది గుమ్మికూడి ఉండరాదని అన్నారు. పై ఆదేశాలను దిక్కరిస్తే చర్యలు తప్పవన్నారు.
Similar News
News December 13, 2025
నూతన సర్పంచులను సన్మానించిన బండి సంజయ్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు, ఉపసర్పంచులను కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సన్మానించారు. వేములవాడ బీజేపీ ఇన్ఛార్జ్ చెన్నమనేని వికాస్ రావు నేతృత్వంలో వారిని సన్మానించి అభినందించారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లు కీలకపాత్ర పోషిస్తారని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సమర్థవంతమైన పాలన అందించాలని వారు సూచించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు గోపి పాల్గొన్నారు.
News December 13, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహుడి ఖజానాకు రూ. 4.27 లక్షలు

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి శనివారం భక్తుల నుంచి భారీగా ఆదాయం సమకూరింది. టికెట్ల విక్రయాలు, ప్రసాదాల విక్రయాలు, అన్నదానం సేవ ద్వారా ఆలయానికి మొత్తం రూ. 4,27,073/- ఆదాయం నమోదైంది. ఇందులో టికెట్ల ద్వారా రూ. 2,30,514/-, ప్రసాదాల ద్వారా రూ. 1,52,140, అన్నదానం సేవ ద్వారా రూ.44,419/- ఆదాయం వచ్చింది. భక్తుల సహకారంతోనే ఆలయ సేవలు నిరంతరం కొనసాగుతున్నాయని ఆలయ అధికారులు తెలిపారు.
News December 13, 2025
వెల్గటూర్: స్నానానికి వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతి

వెల్గటూర్ మండలం కోటిలింగాల వద్ద గోదావరి నదిలో శనివారం గోలెం మల్లయ్య (53) అనే వ్యక్తి గల్లంతై మృతి చెందాడు. గొల్లపల్లి మండలం గంగాపూర్ గ్రామంలో అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తూ స్నానం కోసం నదిలోకి దిగిన మల్లయ్య ఈదుతూ లోతుకు వెళ్లి శక్తి సరిపోక మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టి గంటపాటు శ్రమించి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.


