News January 25, 2025
అనకాపల్లి: ‘జాతరను ప్రశాంతంగా నిర్వహించాలి’

అనకాపల్లి పట్టణంలో శనివారం జరిగే గౌరీ పరమేశ్వరుల జాతరను ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ తుహీన్ సిన్హా విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జాతరకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జాతరకు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఉత్సవ కమిటీ సభ్యులకు ఆయన పలు సూచనలు సలహాలు ఇచ్చారు.
Similar News
News December 4, 2025
గ్లోబల్ సమ్మిట్‌కు HYD వ్యాప్తంగా ఫ్రీ బస్సులు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఎగ్జిబిషన్‌కు ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. ఈ నెల 10 నుంచి 13 వరకు గ్లోబల్ సమ్మిట్‌కు చేరుకునేందుకు MGBS, JBS, కూకట్పల్లి, చార్మినార్, ఎల్బీనగర్ వంటి ప్రధాన కేంద్రాల నుంచి బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. గ్లోబల్ సమ్మిట్‌కు వెళ్లేందుకు ఉ.9 నుంచి మ.1 వరకు, తిరిగి వచ్చేందుకు సా.4 నుంచి రాత్రి 9 వరకు ఇవి అందుబాటులో ఉండనున్నాయి.
News December 4, 2025
ఏడాదిలో సరికొత్త టోల్ వ్యవస్థ: గడ్కరీ

ప్రస్తుతం ఉన్న టోల్ వ్యవస్థ ఏడాదిలోపే కనుమరుగవుతుందని కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడించారు. దాని స్థానంలో ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ను అమలు చేస్తామని చెప్పారు. దీనివల్ల టోల్ పేరుతో NHలపై ఎక్కడా ఆగకుండా ప్రయాణించవచ్చన్నారు. ప్రస్తుతం 10 ప్రాంతాల్లో అమలవుతోన్న ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.10 లక్షల కోట్లతో 4,500 హైవే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని లోక్‌సభలో తెలిపారు.
News December 4, 2025
మునగాల: జీపీలో జాబ్ రిజైన్.. సర్పంచ్‌గా పోటీ

మునగాల మండలం వెంకట్రామపురం గ్రామ పంచాయతీ ఉద్యోగి మంద ముత్తయ్య తన ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వెంకట్రామపురం ఎస్సీ జనరల్ స్థానం కావడంతో, పోటీ చేసేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారులు రాజీనామాను ఆమోదించడంతో, ఆయన ప్రచారం ప్రారంభించారు. అధికార పార్టీ ముత్తయ్యకు మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం.


