News February 24, 2025
అనకాపల్లి జాతరపై పవన్‌కు వినతి

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతరను రాష్ట్ర పండగగా ప్రకటించాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఆయన సోమవారం వినతిపత్రం అందజేశారు. కొత్త అమావాస్య సందర్భంగా నూకాంబికా అమ్మవారి జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని పేర్కొన్నారు.
Similar News
News December 4, 2025
2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులు.. అప్లై చేశారా?

RRBలో 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు ఈ నెల 10 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీజు DEC 12వరకు చెల్లించవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, B.Sc ఉత్తీర్ణులై, 18- 33 ఏళ్ల మధ్య ఉండాలి. స్టేజ్ 1, స్టేజ్ 2 రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. www.rrbcdg.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 4, 2025
భారీ జీతంతో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లో ఉద్యోగాలు

<
News December 4, 2025
నిర్మల్: సర్పంచ్ బరిలో దివ్యాంగుడు

ప్రజాసేవకు అంగవైకల్యం అడ్డు కాదని నిరూపించేందుకు శంకర్ సిద్ధమయ్యాడు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం కౌట్ల–బి నుంచి సర్పంచ్ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ వేశాడు. 2 చేతులు లేకున్నా ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ప్రజాసేవలోకి అడుగుపెట్టాడు. శంకర్ నామినేషన్ వేసిన వెంటనే గ్రామస్థులు అతడిని అభినందించారు. రాజకీయాలు దివ్యాంగులకు అందని ద్రాక్ష కాకూడదని, తాము కూడా ప్రజాసేవలో ముందుంటామని శంకర్ నిరూపించాడు.


