News February 24, 2025

అనకాపల్లి జాతరపై పవన్‌కు వినతి

image

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతరను రాష్ట్ర పండగగా ప్రకటించాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఆయన సోమవారం వినతిపత్రం అందజేశారు. కొత్త అమావాస్య సందర్భంగా నూకాంబికా అమ్మవారి జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని పేర్కొన్నారు.

Similar News

News March 20, 2025

భారీ ఎన్‌కౌంటర్: 30కి చేరిన మృతుల సంఖ్య

image

ఛత్తీస్‌గఢ్‌లోని అండ్రీ అడవుల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 30 మంది నక్సలైట్లు మరణించారు. ఈ పోరులో డీఆర్‌జీ జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది, కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు మరణించారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News March 20, 2025

ఏలూరు: విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి 

image

ఏలూరు జిల్లాలో గడిచిన 30 రోజుల్లో 57,481 ఆధార్ కార్డుల నమోదు ప్రక్రియ జరిగిందని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 5 ఏళ్లలోపు, 15-17 ఏళ్లు ఉన్న విద్యార్థులు ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ఆధార్ అప్డేట్ ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డంకులు దూరమవుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి ఉన్నారు.

News March 20, 2025

NRPT: బడ్జెట్ పత్రాలు దహనం చేసిన నేతలు

image

బడ్జెట్‌లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించారని నిరసన వ్యక్తం చేస్తూ గురువారం నారాయణపేట నర్సిరెడ్డి చౌరస్తాలో PDSU నాయకులు బడ్జెట్ పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ మాట్లాడుతూ.. బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం 7.57శాతం నిధులు కేటాయించారని, ఇది విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర అని అన్నారు. కనీసం 30 శాతం నిధులు కేటాయించి విద్యపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.

error: Content is protected !!