News February 23, 2025
అనకాపల్లి జిల్లాలోని 646 గ్రామాల్లో చెత్త సేకరణ డ్రైవ్

అనకాపల్లి జిల్లాలో ప్రతి ఇంటి నుండి చెత్తసేకరణ ప్రత్యేక డ్రైవ్ విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా పంచాయతీ అధికారి ఆర్. శిరీషారాణి తెలిపారు. పంచాయితీ రాజ్ కమిషనర్ (పి.ఆర్.&ఆర్.డి.) ఆదేశాలను పురస్కరించుకొని శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలో 646 గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సేకరించిన చెత్తను సంపద తయారీ కేంద్రాలకు తరలించామన్నారు.
Similar News
News October 26, 2025
కృష్ణా: తుఫాన్ ప్రభావంపై డీపీఓ హెచ్చరిక

తుఫాన్ ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారిణి (డీపీఓ) జె.అరుణ సూచించారు. మట్టి మిద్దెలు, కల్వర్టులు, పూరి గుడిసెలు, రోడ్డు పక్కన గుడారాల్లో నివసించేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. సచివాలయ ఉద్యోగులు, వీఆర్ఓలు, కార్యదర్శులు, ఇతర సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
News October 26, 2025
నాతో పార్టీ పెట్టించే అవసరం కేసీఆర్కు లేదు: కవిత

TG: తనతో పార్టీ పెట్టించే అవసరం కేసీఆర్కు లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా NZBలో మీడియాతో మాట్లాడారు. ‘అందరికీ మంచి జరగాలనే జనం బాట చేపట్టాం. రాజకీయ పార్టీ అవసరమైతే పెడతాం. నన్ను బయటికి పంపి పార్టీ పెట్టించే అవసరం KCRకు లేదు. KCRను, BRSను ఇష్యూ బేస్డ్గానే విమర్శిస్తాను. కాంగ్రెస్ ఓ మునిగిపోయే నావ. ఆ పార్టీ నాకు మద్దతు ఇవ్వటమేంటి?’ అని వ్యాఖ్యానించారు.
News October 26, 2025
కృష్ణా: జిల్లాలో మండల ప్రత్యేక అధికారుల నియామకం

మొంథా తుపాన్ పరిస్థితులను అంచనా వేసేందుకు గాను జిల్లాలోని 25 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ శాఖల జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. మండల స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని సజావుగా తుపాన్ ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.


