News January 29, 2025
అనకాపల్లి జిల్లాలో అమల్లోకి ఎన్నికల కోడ్

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించినట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. వచ్చేనెల 3న నోటిఫికేషన్ జారీ అవుతుందన్నారు. 10వ తేదీ నామినేషన్లకు చివరి రోజుగా పేర్కొన్నారు. ఉపసంహరణకు 13 చివరి తేదీ అని తెలిపారు. పోలింగ్ ఫిబ్రవరి 27వ తేదీన, మార్చి 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని పేర్కొన్నారు. బుధవారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు.
Similar News
News February 19, 2025
ఐరాల: మహిళా ఉద్యోగులను వేధిస్తున్న వ్యక్తికి దేహశుద్ధి

మహిళా బ్యాంకు ఉద్యోగులను వేధిస్తున్న వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. స్థానికుల కథనం మేరకు.. కాణిపాకంకు చెందిన భూపాల్ వైఎస్ గేటులో ఉన్న ఓ బ్యాంకులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను చిత్తూరు నుంచి బస్సులో వస్తుండగా నిత్యం వేధిస్తున్నాడు. ఈ వేధింపులపై ఆగ్రహించిన స్థానికులు అతనిని కరెంటు స్తంభానికి కట్టి దేహశుద్ధి చేశారు.
News February 19, 2025
గన్‌తో బెదిరిస్తున్నారు: పీలేరు సర్పంచ్

పీలేరు ఈవో గురుమోహన్‌పై స్థానిక సర్పంచ్ హబీబ్ బాషా సంచలన ఆరోపణలు చేశారు. ఈవో అవినీతి అక్రమాలకు పాల్పడడమే కాకుండా సమస్యలపై ప్రశ్నించిన వారికి తన వద్ద ఉన్న గన్ చూపించి బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు పంచాయతీ వార్డు సభ్యులతో కలిసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. కార్మికులకు జీతాలు ఇవ్వకపోగా కొన్ని నెలలుగా వారికి ఈపీఎఫ్ డిపాజిట్ చేయలేదన్నారు. ఈవోపై చర్యలు తీసుకోవాలని కోరారు.
News February 19, 2025
ఒంగోలు కోర్టులో 8మంది నేరస్థులకు జీవిత ఖైదు

మార్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2015లో జరిగిన రత్నం బాబు(22) హత్య కేసులో 8మంది నేరస్థులకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.5వేల జరిమానా విధిస్తూ ఒంగోలు అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి టి.రాజవెంకటాద్రి తీర్పు ఇచ్చారు. రత్నంబాబు కరిష్మా అనే యువతిని ప్రేమించాడు. అది నచ్చని యువతి కుటుంబ సభ్యులు రత్నంబాబును కత్తులతో పొడిచి హత్య చేశారు. నేరం రుజువు కావడంతో వీరికి మంగళవారం శిక్ష ఖరారైంది.