News April 8, 2025

అనకాపల్లి జిల్లాలో ‘గుండె’లు పిండేసిన ఘటన

image

బుచ్చయ్యపేట(M)బంగారుమెట్టులో విషాదం నెలకొంది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో గుండెపోటుతో సోమవారం మరణించారు. మేరుగు శ్రీను(28) పెయింటింగ్ పనికి అరకు వెళ్లాడు. పని చేస్తుండగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లేలోపే మరణించాడు. కార్పెంటర్‌గా పనిచేస్తున్న నక్కా లక్ష్మీనారాయణ(48) మధువాడ ఐటీ హిల్స్ వద్ద గుండెపోటుతో రోడ్డుపైనే కుప్పకూలి మరణించాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Similar News

News December 6, 2025

అంబేడ్కర్ గురించి ఈ విషయాలు తెలుసా?

image

*విదేశాల్లో ఎకనామిక్స్‌లో PhD చేసిన తొలి భారతీయుడు
*కొలంబియా యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో 29, హిస్టరీలో 11, సోషియాలజీలో 6, ఫిలాసఫీలో 5, ఆస్ట్రాలజీలో 4, పాలిటిక్స్‌లో 3 కోర్సులు చేశారు
*1935లో ఆర్బీఐ ఏర్పాటులో కీలకపాత్ర
*అంబేడ్కర్ పర్సనల్ లైబ్రరీలో 50వేల పుస్తకాలు ఉండేవి
*దేశంలో పనిగంటలను రోజుకు 14 గం. నుంచి 8 గం.కు తగ్గించారు
>ఇవాళ అంబేడ్కర్ వర్ధంతి

News December 6, 2025

KMR: బుజ్జగింపు పర్వం సక్సెస్ అయ్యేనా?

image

KMR జిల్లాలో 2వ విడత నామినేషన్ల ఉపసంహరణకు కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రధాన పార్టీలకు సొంత పార్టీ రెబల్స్, స్వతంత్ర అభ్యర్థుల నుంచి ముప్పు పొంచి ఉంది. వారిని బుజ్జగించి పోటీ నుంచి తప్పించేందుకు బడా నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే ఈ రణరంగంలో ఉండేదేవరు? ఊడేదెవరు అన్నది పలు చోట్ల ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రెబల్స్ బెట్టు వీడతారా? లేక ఇండిపెండెంట్‌గా సై అంటారా? ఇవాళ సాయంత్రం వరకు ఈ ఉత్కంఠ తప్పదు!

News December 6, 2025

నితీశ్‌ కొడుకు రాజకీయాల్లోకి రావొచ్చు: JDU నేత

image

బిహార్‌ CM నితీశ్‌కుమార్‌ తనయుడు నిశాంత్‌ త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. JDU జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్‌కుమార్‌ వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. “పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. నిర్ణయం మాత్రం ఆయనదే” అని అన్నారు. ఇటీవల ఎన్నికల్లో నిశాంత్ పోటీ చేయకపోయినా కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.