News February 28, 2025
అనకాపల్లి జిల్లాలో టుడే టాప్ న్యూస్

➤ రాష్ట్ర పండగగా అనకాపల్లి నూకాలమ్మ జాతర
➤ రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు రాయనున్న 26,161 మంది విద్యార్థులు
➤ జిల్లాలో అన్ని పాఠశాల్లో సైన్స్ డే వేడుకలు
➤ ఘనంగా టైలర్స్ డే వేడుకలు
➤ రంగురాళ్ల క్వారీని తనిఖీ చేసిన నర్సీపట్నం డీఎస్పీ
➤ రైవాడ హత్య కేసులో ఇద్దరు మహిళలు అరెస్ట్
➤ లచ్చన్నపాలెం, పైడిపాలలో జేసీ పర్యటన
➤ నర్సీపట్నంలో పెట్రోల్ ట్యాంకర్ బీభత్సం
Similar News
News March 1, 2025
గుంటూరు: 80 ఏళ్ల వయస్సులో మూడు బంగారు పతకాలు

గుంటూరుకు చెందిన దివాకర్(80) ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లో జరిగిన 80 సంవత్సరాల స్పోర్ట్స్ మీట్లో మూడు గోల్డ్ మెడల్స్ సాధించారు. హేమర్, జావలిన్, డిస్క్ త్రోలో వరుసగా మూడు బంగారు పథకాలను సాధించారు. గుంటూరు ఆఫీసర్స్ క్లబ్ మేనేజర్‌గా ఈయన పనిచేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో అనంతపూర్‌లో జరిగిన పోటీలలో కూడా 3 బంగారపు పతకాలను కైవసం చేసుకున్నాడు. దీంతో ఈయనను పలువురు అధికారులు అభినందించారు.
News March 1, 2025
శివకుమార్ పార్టీని చీలుస్తారు: బీజేపీ నేత

కర్ణాటక కాంగ్రెస్‌లో చీలికలు వచ్చేఅవకాశముందని ప్రతిపక్ష బీజేపీ నేత అశోక ఆరోపించారు. ఏక్నాథ్ శిందే తరహాలో ఆ పార్టీని ఉపముఖ్యమంత్రి డి.కే శివకుమార్ బీజేపీలో విలీనం చేసే అవకాశముందని తెలిపారు. నవంబర్16న కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు జరగనుందని జోస్యం చెప్పారు. అయితే శివరాత్రి వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో పాటు డి.కే శివకుమార్ పాల్గొనటంతో పుకార్లు రేగాయి. ఉప ముఖ్యమంత్రి దీన్ని ఖండించారు.
News March 1, 2025
వేమనపల్లి ఆశ్రమ పాఠశాల హెచ్ఎం సస్పెన్షన్

మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ శ్రీనివాస్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. పాఠశాలలో బియ్యం పక్కదారి పట్టించారనే ఆరోపణల మేరకు ఉట్నూరు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా వేమనపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల హెడ్మాస్టర్ మాధవ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.