News March 15, 2025
అనకాపల్లి జిల్లాలో టుడే టాప్ న్యూస్

➤ దిబ్బడి, కె.ఎం.పాలెంలో అగ్నికి ఆహుతైన తోటలు
➤ జిల్లావ్యాప్తంగా ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ కార్యక్రమం
➤ CMRF చెక్కులను పంపిణీ చేసిన స్పీకర్
➤ చెత్త సంపద కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ విజయ కృష్ణన్
➤ ఖండివరం హైస్కూల్ HMకు షోకాజ్ నోటీసులు
➤ మాకవరపాలెంలో విద్యార్థులకు గ్రంధి వాపు పరీక్షలు
➤ నేటితో ముగిసిన ఇంటర్ సెకండియర్ పరీక్షలు
➤ స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేసిన మాడుగుల ఎమ్మెల్యే బండారు
Similar News
News November 26, 2025
రేపు BRS హైదరాబాద్ కీలక సమావేశం

BRS హైదరాబాద్ జిల్లా కీలక సమావేశం రేపు (గురువారం) జరుగనుంది. సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్లో జరిగే ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR హాజరుకానున్నారని తలసాని తెలిపారు. ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్ వేడుకల గురించి సమావేశంలో చర్చించనున్నారు.
News November 26, 2025
గొల్లగూడెంలో CM పర్యటన.. భద్రత ఏర్పాట్లు పరిశీలించిన SP

ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో డిసెంబర్ 1న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎస్పీ ప్రతాప్ కిషోర్ భద్రత ఏర్పాట్లు పరిశీలించి అధికారులకి కీలక సూచనలు చేశారు. వాహనాల మళ్లింపు, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పర్యటన ప్రశాంతంగా, సురక్షితంగా ముగిసేలా ప్రతి అధికారి బాధ్యత వహించాలని ఆదేశించారు.
News November 26, 2025
ఏంటి బ్రో.. కనీస పోటీ ఇవ్వలేరా?

సొంత గడ్డపై సౌతాఫ్రికా చేతిలో 2 టెస్టుల్లోనూ ఓడిపోవడాన్ని IND ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కనీస పోటీ ఇవ్వకుండా చేతులెత్తేయడంపై మండిపడుతున్నారు. టెస్టులకు అవసరమైన ఓర్పు, సహనం మన క్రికెటర్లలో లోపించాయంటున్నారు. అలాగే కోచ్ గంభీర్ పనితీరూ సరిగా లేదని చెబుతున్నారు. ఆయన హయాంలోనే స్వదేశంలో NZ చేతిలో 3-0, ఆస్ట్రేలియాలో 1-3, ఇప్పుడు SA చేతిలో 0-2 తేడాతో పరాజయాలు పలకరించాయని గుర్తు చేస్తున్నారు.


