News July 22, 2024
అనకాపల్లి జిల్లాలో నేడు విద్యాసంస్థలకు సెలవు

అనకాపల్లి జిల్లాలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కలెక్టర్ విజయ్ కృష్ణన్ సోమవారం సెలవు ప్రకటించారు. విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలు ఆదేశాలు పాటించాలన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా పాఠశాలలు తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఎంఈవోలు పర్యవేక్షణ చేయాలని సూచించారు.
Similar News
News September 16, 2025
విశాఖ చేరుకున్న నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాత్రి విశాఖ చేరుకున్నారు. రేపు పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. ఈనెల 22 నుంచి కొత్త జీఎస్టీ అమలు కానుంది. దీంతో అనేక వస్తువుల ధరలు తగ్గనున్నాయి. జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కార్యక్రమంతో పాటు స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్లో ఆమె పాల్గొంటారు. సీఎం చంద్రబాబు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.
News September 16, 2025
గోపాలపట్నంలో దారుణ హత్య

గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లపువానిపాలెం 89వ వార్డులో దారుణం జరిగింది. అలమండ నితీశ్ (23) అనే వ్యక్తి భీశెట్టి పరదేశి (75)పై బండరాయితో దాడి చేసి హత్య చేశాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానికులను కూడా బెదిరించాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News September 16, 2025
ప్రజలకు విశాఖ సిటీ పోలీసుల హెచ్చరిక

విశాఖపట్నం సిటీ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. లోన్ యాప్స్ వలలో పడి అనేక మంది వేధింపులకు గురవుతున్నారని పేర్కొన్నారు. డౌన్లోడ్ చేసిన వెంటనే వ్యక్తిగత సమాచారం దోచుకుని, ఫోటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారని తెలిపారు. సైబర్ మోసాలకు గురవకుండా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి మోసాలు ఎదురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు.