News April 24, 2024
అనకాపల్లి జిల్లాలో పది పరీక్షలో 89.04 శాతం మంది ఉత్తీర్ణత

అనకాపల్లి జిల్లాలో 10 పరీక్షల్లో 89.04 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు. జిల్లాలో మొత్తం 21,169 మంది పరీక్షకు హాజరు కాగా 18,848 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 14,725 ప్రథమ శ్రేణిలో, 2,867 మంది ద్వితీయ శ్రేణిలో, 1256 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులైనట్లు డీఈఓ వెంకటలక్ష్మమ్మ తెలిపారు. పాయకరావుపేట జడ్పీ బాలికల హైస్కూల్‌కు చెందిన కె. సత్య ధనస్వాతి 592 మార్కులు సాధించి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది.
Similar News
News March 5, 2026
ముగ్గురు సహచరులు – ఒక్కటే లక్ష్యం: నారా లోకేశ్

2024 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీలు సాధించిన ముగ్గురు నేతల (లోకేశ్, పల్లా, గంటా శ్రీనివాసరావు) అరుదైన ఫొటోను మంత్రి నారా లోకేశ్ పంచుకున్నారు. అత్యధిక ఓట్ల మెజారిటీ పొందిన ముగ్గురు సహచరులుగా.. ఈ గెలుపు తమపై ఉన్న గురుతర బాధ్యతను గుర్తు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రతిరోజూ పూర్తి నిబద్ధతతో, వినమ్రతతో ప్రజలకు సేవ చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
News March 5, 2026
విశాఖలో నడిరోడ్డుపై మృతదేహం

విశాఖలో నడిరోడ్డుపై వ్యక్తి విగతజీవిగా పడిఉన్నాడు. అందరూ చూస్తున్నారే గానీ ఎవరూ పట్టించుకోవడంలేదు. గంటల తరబడి మృతదేహం అలాగే ఉన్నా సమీపంలో ట్రాఫిక్ పోలీసులు సైతం పట్టించుకోలేదు. ఇసుకతోట జంక్షన్ వెంకజిపాలెం వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపై గంటల తరబడి మృతదేహం అలానే ఉంది.
News March 4, 2026
రేపు విశాఖలో పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం

నరవ నుంచి వచ్చే ప్రధాన పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా గురువారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నగరంలోని ఈస్ట్, వెస్ట్, పెందుర్తి జోన్ల పరిధిలో తాగునీటి సరఫరా నిలిచిపోతుందని జీవీఎంసీ ఈఈ మురళీకృష్ణ తెలిపారు. లక్ష్మీ నగర్, జ్యోతి నగర్ ఏరియాల్లో లీకేజీలను అరికట్టేందుకు ఈ చర్యలు చేపడుతున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని, ప్రజలు సహకరించాలన్నారు.


