News March 28, 2025
అనకాపల్లి జిల్లాలో పదో తరగతి పరీక్షకు 222 మంది గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో శుక్రవారం జరిగిన పదో తరగతి బీఎస్ పరీక్షకు 222 విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 20,774 మంది హాజరు కావాల్సి ఉండగా 20,669 మంది హాజరైనట్లు తెలిపారు. ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 766 మంది హాజరు కావాల్సి ఉండగా 649 మంది హాజరైనట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.
Similar News
News November 25, 2025
అమరావతిలో 25 బ్యాంకుల శంకుస్థాపనకు సిద్ధం

అమరావతిని ఆర్థిక–వాణిజ్య కేంద్రంగా మార్చే దిశగా పెద్ద అడుగు పడుతోంది. ఈ నెల 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ CRDA కార్యాలయంతో పాటు ఏర్పాటు చేసిన వేదికపై 25 బ్యాంకుల కొత్త భవనాలకు శంకుస్థాపన చేస్తారు. RBI రీజియనల్ ఆఫీస్‌తో పాటు జాతీయ, ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల భూముల కేటాయింపు పూర్తైంది. 49.5 ఎకరాలు సంస్థలకు, 12.66 ఎకరాలు అధికారుల నివాసాలకు కేటాయించారు.
News November 25, 2025
ప.గో: ఆన్లైన్లో పందెంకోళ్లు

సంక్రాంతి సమీపించడంతో కోడిపుంజుల విక్రయాలు జోరందుకుంటున్నాయి. బైక్‌లు, గృహోపకరణాల తరహాలోనే.. సోషల్ మీడియా వేదికగా పుంజుల ఫొటోలు, వీడియోలు, జాతి, బరువు వంటి వివరాలను పోస్ట్ చేస్తూ విక్రేతలు ఆకర్షిస్తున్నారు. పాలకొల్లులో రహదారుల పక్కన విక్రయాలు సాగుతుండగా.. దూర ప్రాంతాల నుంచి విచ్చేసి మరీ కొనుగోలు చేస్తున్నారు. జాతి, సైజును బట్టి ఒక్కో కోడి రూ.1500 నుంచి రూ.20,000 వరకు విక్రయిస్తున్నారు.
News November 25, 2025
వరంగల్ సీపీగా అవినాశ్ మహంతి..?

వరంగల్ సీపీగా అవినాశ్ మహంతిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల్లో కొందరికి మింగుడు పడటం లేదని సమాచారం. ప్రభుత్వం మాత్రం లా అండ్ ఆర్డర్‌ను అదుపులో పెట్టేందుకు ఈ మార్పు తీసుకువచ్చే అవకాశం ఉందని పోలీస్ గ్రూపులు, సోషల్ మీడియాలో చర్చగా మారింది. అయితే ఐజీ స్థాయి అధికారి వరంగల్‌కు వచ్చే అవకాశం ఉందా? అని పోలీస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.


