News March 17, 2025

అనకాపల్లి జిల్లాలో ప్రమాదాలు జరగకుండా చర్యలు: ఎస్పీ

image

అనకాపల్లి జిల్లా పోలీసులు ప్రమాదాలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు. సోమవారం ఆయన సమావేశంలో మాట్లాడుతూ.. లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా లారీ యజమానులు, డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి రవాణా నిబంధనలు, రహదారి భద్రతా నియమాలు గురించి అవగాహన కల్పించాలని అధికారులు కు సూచించారు.

Similar News

News November 22, 2025

వరికి మానిపండు తెగులు ముప్పు

image

వరి పంట పూత దశలో ఉన్నప్పుడు గాలిలో అధిక తేమ, మంచు, మబ్బులతో కూడిన వాతావరణం ఉంటే మానిపండు తెగులు లేదా కాటుక తెగులు ఆశించడానికి, వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీని వల్ల వెన్నులోని గింజలు తొలుత పసుపుగా తర్వాత నల్లగా మారతాయి. తెగులు కట్టడికి వాతావరణ పరిస్థితులనుబట్టి సాయంకాలపు వేళ.. 200 లీటర్ల నీటిలో ఎకరాకు ప్రాపికొనజోల్ 200ml లేదా క్లోరోథలోనిల్ 400 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.

News November 22, 2025

ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తనిఖీ

image

ఉర్సు గుట్ట వద్ద ఉన్న ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ శనివారం మధ్యాహ్నం తనిఖీ చేశారు. ఆస్తుల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ పత్రాల ఆన్‌లైన్ ప్రక్రియను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.

News November 22, 2025

గ్రీన్ ఫీల్డ్ హైవేలో పరిహారం చెల్లింపుల్లో గందరగోళం..!

image

గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం భూములు కోల్పోతున్న రైతులు పరిహారం పూర్తిగా రాకపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సంగెం, నెక్కొండ, గీసుగొండ, పర్వతగిరి మండలాల్లో వేలాది ఎకరాలు ప్రాజెక్ట్‌లో పోయినా, కొంతమంది రైతులకు మాత్రమే పరిహారం జమ అయింది. భూములు పాస్‌పుస్తకాల నుంచి తొలగించడంతో రైతుభరోసా కూడా అందక రైతులు కుంగిపోతున్నారు. పంటలు వేయొద్దని అధికారులు చెప్పడంతో జీవనోపాధి సందిగ్ధంలో పడిందని రైతులు వాపోతున్నారు.