News March 7, 2025

అనకాపల్లి జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

image

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. అనకాపల్లి జిల్లా వాసులు ఎక్కువగా విశాఖ, శ్రీకాకుళం వెళ్తుంటారు. విశాఖలో ఇంజినీరింగ్ కాలేజీలు ఉండటంతో విద్యార్థినీలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా విశాఖ, సిక్కోలు వెళ్లాలంటే టికెట్ కొనాల్సిందే. ఇలా జిల్లా బార్డర్‌లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై కామెంట్.

Similar News

News March 14, 2026

రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాల అమ్మకాలు

image

భారత్‌లో ఈ ఫిబ్రవరిలో 4,17,705 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడైనట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్(SIAM) వెల్లడించింది. 2025 FEBతో పోలిస్తే ఇది 10% అధికం. 2, 3 వీలర్ల అమ్మకాలు ఫిబ్రవరి నెలలో ఆల్ టైమ్ గరిష్ఠాలను నమోదు చేశాయి. 2 వీలర్ సేల్స్(18,71,406) 35.2%, 3 వీలర్ సేల్స్(74,573) 29% పెరిగాయి. ప్యాసింజర్ వాహనాల్లో మారుతి సుజుకి, 2 వీలర్లలో హీరో మోటోకార్ప్ టాప్‌లో నిలిచాయి.

News March 14, 2026

టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: MHBD కలెక్టర్

image

మహబూబాబాద్ జిల్లాలో మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల కోసం 45 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. మొత్తం 8,157 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా అందులో 4,156 మంది బాలురు, 4001 మంది బాలికలు ఉన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు అరగంట ముందే చేరుకోవాలన్నారు.కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ జిరాక్స్ దుకాణాలు మూసివేయనున్నారు.

News March 14, 2026

గ్యాస్ సరఫరాపై నిరంతర నిఘా: కలెక్టర్

image

సూర్యాపేట జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరాను మానిటరింగ్ కమిటీ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. శుక్రవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. డొమెస్టిక్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని, నిబంధనలు ఉల్లంఘించే ఏజెన్సీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.