News February 11, 2025
అనకాపల్లి జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం

గంజాయి రవాణా కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా పేర్కొన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మాకవరపాలెం మండలం పైడిపాల జంక్షన్ వద్ద మంగళవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బొలెరో వాహనంలో గంజాయి గుర్తించామన్నారు. ఆ వాహనంలో 515 కేజీల గంజాయి పట్టుబడిందని.. దాని విలులు రూ.25,75,000 ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. నిందుతులను పట్టుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు.
Similar News
News November 7, 2025
‘అనుమతులు లేని ఆర్ఎంపీ వైద్యులపై చర్యలు తీసుకోవాలి’

అనుమతులు లేని ఆర్ఎంపీ, పీఎంపీల క్లినిక్ లపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల ఆద్వర్యంలో కలెక్టర్ ఏఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్ఎంపీలు, పీఎంపీలు చలామణి అవుతున్న వైద్యులు తమ స్థాయికి మించి వైద్యం చేస్తున్నారని ఆరోపించారు. రోగులకు అధిక మొత్తంలో ఇంజెక్షన్ లు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఆర్ఎంపీలు ప్రథమ చికిత్సలకే పరిమితం కావాలని వారు కోరారు.
News November 7, 2025
ASF: ‘మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించండి’

జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కృష్ణమాచారి అన్నారు. ఈరోజు కార్మికులతో కలిసి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సూపరిడెంట్ శ్రీనివాస్ కు వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. జిల్లా కార్యదర్శి పాగిడి మాయ మాట్లాడుతూ.. 8 నెలలుగా పెండింగ్లో ఉన్న గౌరవ వేతనం కోడిగుడ్ల బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు.
News November 7, 2025
నిర్మల్: ఈనెల 15న స్పెషల్ లోక్ అదాలత్

నవంబర్ 15న జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల విజ్ఞప్తి చేశారు. ఈ అదాలత్లో మైనర్ కేసులు, అంతగా తీవ్రం కాని లా అండ్ ఆర్డర్, క్రిమినల్ కేసులను పరిష్కరిస్తారని ఆమె తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమపై ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని ఎస్పీ కోరారు.


