News April 7, 2025
అనకాపల్లి జిల్లాలో మరో ఐదు రోజులు వర్షాలు

ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో జిల్లాలో మరో ఐదు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Similar News
News November 24, 2025
కెప్టెన్ దీపకకు మడకశిర ఎమ్మెల్యే అభినందన

శ్రీలంకలో జరిగిన అంధ మహిళల తొలి టీ20 వరల్డ్‌కప్‌లో టీమ్ఇండియా నేపాల్‌ను ఓడించి విజేతగా నిలిచింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా శ్రీసత్యసాయి జిల్లా అమరాపురం మండలం తంబాలహట్టికి చెందిన దీపిక వ్యవహరించారు. వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన దీపికను మడకశిర ఎమ్మెల్యే రాజు అభినందించారు. దీపిక సారథ్యంలో భారత్ తొలిసారిగా ఈ కప్‌ను గెలుచుకుందని సంతోషం వ్యక్తం చేశారు.
News November 24, 2025
వంటింటి చిట్కాలు

* కేక్ మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్ కలిపితే కేక్ ఎక్కువకాలం తాజాగా ఉంటుంది.
* పూరీలు మృదువుగా రావాలంటే పిండిని పాలతో కలపాలి.
* కూరల్లో గ్రేవీ చిక్కగా రావాలంటే అందులో కొంచెం కొబ్బరి పాలు లేదా పెరుగు కలపాలి.
* దుంపలు ఉడికించిన నీటితో వెండి పట్టీలు శుభ్రం చేస్తే తళతలా మెరుస్తాయి.
* కాలీఫ్లవర్ కూరలో టేబుల్ స్పూన్ పాలు కలిపితే కూర రుచిగా ఉంటుంది.
News November 24, 2025
6GHz స్పెక్ట్రమ్ వివాదం.. టెలికం vs టెక్ దిగ్గజాలు

6GHz బ్యాండ్ కేటాయింపుపై రిలయన్స్ జియో, VI, ఎయిర్‌టెల్‌కి వ్యతిరేకంగా అమెరికన్ టెక్ దిగ్గజాలు ఏకం అయ్యాయి. మొత్తం 1200 MHzను మొబైల్ సేవల కోసం వేలానికి పెట్టాలని జియో కోరగా Apple, Amazon, Meta, Cisco, HP, Intel సంస్థలు ఈ బ్యాండ్ మొబైల్ సేవలకు సాంకేతికంగా సిద్ధంగా లేదని పేర్కొన్నాయి. పూర్తిగా వైఫై కోసం మాత్రమే ఉంచాలని TRAIకి సూచించాయి.


