News April 7, 2025
అనకాపల్లి జిల్లాలో యువకుడి హత్య

రావికమతం మండలం గర్ణికం గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. మేడివాడకి చెందిన కొలిపాక పవన్ కుమార్(22) హత్యకు గురై మరణించాడు. కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, రావికమతం ఎస్ఐ రఘువర్మ, అనకాపల్లికి చెందిన క్లూస్ టీం ఘటనా స్థలం చేరుకొని హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఫోన్ కొనేందుకు ఆదివారం పవన్ రావికమతం వచ్చినట్లు తండ్రి త్రిమూర్తులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 11, 2025
GHMCకి మీడియాకు వారానికోసారి ఎంట్రీ?

జర్నలిస్టులు ఇక ఎప్పుడు పడితే అప్పుడు GHMC ప్రధాన కార్యాలయంలోకి వెళ్లడానికి వీలుపడకపోవచ్చు. రెగ్యులర్ జర్నలిస్టులతో పాటు యూట్యూబ్ ఛానళ్ల వారు నిత్యం అధికారులను కలిసేందుకు వస్తున్నారని, దీంతో విధినిర్వహణకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. అందుకే అక్రిడిటేషన్ ఉన్న వారిని మాత్రమే వారానికి ఒకసారి అనుమతించాలని నిర్ణయించినట్లు సమాచారం.
News July 11, 2025
HYD: మాయం కానున్న ఆ మూడు పార్టీలు!

తెలంగాణలో మూడు పార్టీలు మాయం కానున్నాయి. అన్ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ పార్టీలైన ఏపీ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ, జాతీయ మహిళా పార్టీ, యువ తెలంగాణ పార్టీలు రాష్ట్రంలో 2019 నుంచి లోక్‌సభ, అసెంబ్లీ, ఉపఎన్నికల్లో పోటీచేయలేదు. దీంతో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఆయా పార్టీలకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తొలగింపు ప్రతిపాదనకు నోటీసులు పంపించారు.
News July 11, 2025
‘కొండ’ను ఢీకొనడం కష్టమే..!

నలుగురు ఎమ్మెల్యేలు జట్టుకట్టినా కొండా దంపతులను ఢీకొనడం సాధ్యం కావడం లేదు. ఇద్దరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, నలుగురు ఎమ్మెల్యేలు ఏకమై పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎదుట ఏకరువు పెట్టినా ఏం చేయలేకతున్నారనే టాక్ ఓరుగల్లులో ఉంది. ఉమ్మడి వరంగల్‌లో 7 స్థానాలను తామే గెలిపించామని, వాళ్లకు అంత సీన్ లేదంటూ కొండా దంపతులు కార్యకర్తలతో బాహాటంగానే చెప్తుండడం చూస్తుంటే నిజమేనని తెలుస్తుంది.