News February 24, 2025

అనకాపల్లి జిల్లాలో రెండు రోజులు వైన్స్ బంద్ 

image

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భాన్ని పురస్కరించుకుని ఈనెల 25వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అనకాపల్లి జిల్లాలో మద్యం షాపులను మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారి సుధీర్ తెలిపారు. సోమవారం ఆయన అనకాపల్లిలో మాట్లాడుతూ.. వచ్చేనెల మూడవ తేదీన(మార్చి 3) ఓట్ల లెక్కింపు సందర్భంగా మద్యం షాపులను మూసివేస్తామన్నారు.

Similar News

News December 5, 2025

నాలుగు వేదాల ప్రతీక ‘తిరుమాడ వీధులు’

image

తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ 4 దిక్కులా ఉన్న వీధులను తిరుమాడ వీధులు అంటారు. వీటిని 4 వేదాలకు ప్రతీకగా భావిస్తారు. భగవద్రామానుజులవారు స్వామివారి ఊరేగింపుల కోసం వీటిని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి వాహన సేవలు ఈ పవిత్ర వీధులలోనే వైభవంగా జరుగుతాయి. వీటి పవిత్రత కారణంగా, ఈ మాడ వీధుల్లో పాదరక్షలు ధరించడం నిషేధం. ఈ వీధులు స్వామివారి వైభవాన్ని లోకానికి చాటిచెబుతాయి. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News December 5, 2025

సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళాలు ఇవ్వండి: కలెక్టర్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ శుక్రవారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ నిధికి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు విరివిగా విరాళాలు అందజేయాలని కోరారు. గోడపత్రికపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ సులభంగా విరాళాలను జమ చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

News December 5, 2025

కోతులను పట్టిస్తేనే.. సర్పంచ్‌గా గెలిపిస్తాం: మాదారం గ్రామస్థులు

image

భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలంలోని మాదారం గ్రామ ప్రజలు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా మారి, పంటలను నాశనం చేస్తుండటంతో ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారు కోతుల సమస్యను పరిష్కరించే అభ్యర్థినే తాము గెలిపిస్తామని గ్రామ ప్రజలు, యూత్ సభ్యులు స్పష్టం చేశారు.