News February 24, 2025
అనకాపల్లి జిల్లాలో రెండు రోజులు వైన్స్ బంద్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భాన్ని పురస్కరించుకుని ఈనెల 25వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అనకాపల్లి జిల్లాలో మద్యం షాపులను మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారి సుధీర్ తెలిపారు. సోమవారం ఆయన అనకాపల్లిలో మాట్లాడుతూ.. వచ్చేనెల మూడవ తేదీన(మార్చి 3) ఓట్ల లెక్కింపు సందర్భంగా మద్యం షాపులను మూసివేస్తామన్నారు.
Similar News
News March 25, 2025
విశాఖ మేయర్ పీఠం.. రంగంలోకి లోకేశ్..?

విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌తో జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరి ప్రసాద్ నేడు సమావేశమయ్యారు. రేపు మంత్రి లోకేశ్ విశాఖ వచ్చి స్థానిక నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం. అవిశ్వాసంలో నెగ్గితే మేయర్ పదవి టీడీపీకి.. డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
News March 25, 2025
MBNR: BJP స్టేట్ చీఫ్ రేసులో DK.అరుణ

తెలంగాణ BJPకి ఉగాదిలోపు కొత్త చీఫ్ వస్తారనే సమాచారం. దీనిపై పార్టీ అధిష్ఠానం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కాగా ఓసీ కేటగిరీలో MBNR ఎంపీ డీకే అరుణ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు MP రఘునందన్‌రావు, మాజీ MLC రామచందర్‌రావు, ఎంపీలు ఈటల, ధర్మపురి అర్వింద్ పేర్లు కూడా రేసులో ఉన్నాయి. పాలమూరుతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో అరుణమ్మకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆమెకే ఇవ్వాలని స్థానిక BJP శ్రేణులు అంటున్నాయి.
News March 25, 2025
ఈ IPL సీజన్‌లో వారిదే హవా..!

IPL 2025లో జట్లు మారిన ఆటగాళ్లు చెలరేగుతున్నారు. ఇప్పటివరకు 4 మ్యాచులు జరగ్గా అన్నిట్లోనూ ఫ్రాంచైజీలు మారిన ఆటగాళ్లే POTMగా నిలిచారు. వీరిలో కృనాల్ పాండ్య (RCB), ఇషాన్ కిషన్ (SRH), నూర్ అహ్మద్ (CSK), అశుతోశ్ శర్మ (DC) ఉన్నారు. గత సీజన్‌లో వీరు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఈ సీజన్‌లో జట్టు మారగానే విధ్వంసం సృష్టిస్తున్నారు. స్టార్ ప్లేయర్ల కంటే మెరుగైన ప్రదర్శన చేస్తూ దూసుకుపోతున్నారు.