News March 23, 2025

అనకాపల్లి జిల్లాలో లారీ బీభత్సం.. ఐదుగురికి తీవ్ర గాయాలు

image

మాడుగుల మండలం గాదిరాయిలో ఓ ట్రాలీ లారీ ఆదివారం సాయంత్రం బీభత్సం సృష్టించింది. గాదిరాయి వద్ద లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపి 3 బైకులను బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బైకులపై వెళ్తున్న ఐదుగురు తీవ్ర గాయాలైనట్లు ఎస్‌ఐ నారాయణరావు చెప్పారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్ల ప్రమాదం జరిగిందన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News March 26, 2025

MBNR: ఆ కళాశాలలకు గమనిక

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 2024-25 సంవత్సరంలోపు అఫిలియేషన్ ముగిసిన కళాశాల యాజమాన్యాలు తిరిగి అఫిలియేషన్ చేయించుకోవాలని జిల్లా ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ ప్రధానాచార్యులు మహమ్మద్ మేరాజుల్లా ఖాన్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈనెల 31వ తేదీలోపు అఫిలియేషన్ చేయించుకునేందుకు అవకాశం ఉందన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని కళాశాలల యాజమాన్యాలు ఉపయోగించుకోవాలని సూచించారు.

News March 26, 2025

సిరిసిల్ల జిల్లాలో 14 మంది విద్యార్థులు గైర్హాజర్

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బుధవారం జరిగిన పదోతరగతి పరీక్షలకు 14 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు తెలిపారు. జిల్లాలో మొత్తం 35 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. 6767 మంది విద్యార్థులకు 6750 విద్యార్థులు పరీక్ష రాయగా 14 మంది విద్యార్థులు పరీక్షలు హాజరుకాలేదని తెలిపారు. 

News March 26, 2025

ఉగాది రోజు సన్నబియ్యం పథకం ప్రారంభం: మంత్రి ఉత్తమ్

image

ఉగాది రోజున సన్నబియ్యం పథకం ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్‌కార్డుదారులకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వబోతున్నట్లు చెప్పారు. సన్నబియ్యంపై సభ్యుల సలహాలు, సూచనలు తీసుకుంటామని అన్నారు. సన్నబియ్యం స్కీమ్‌తో 84 శాతం మంది పేదలు లబ్ధి పొందనున్నారని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.

error: Content is protected !!