News March 22, 2025

అనకాపల్లి జిల్లాలో వడగాల్పులు

image

జిల్లాలో పలు చోట్ల గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని APSDMA తెలిపింది. జిల్లాలో శుక్రవారం నాతవరంలో 40.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. శనివారం జిల్లాలోని పలు మండలాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండల దెబ్బకు వడదెబ్బలు తగిలే అవకాశం ఉందని తెలిపింది. అటు వైద్య శాఖ సైతం పలు సూచనలు చేసింది.

Similar News

News March 23, 2025

తుళ్లూరు: సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

image

ఈనెల 31 తేదీన అమరావతి రాజధాని ప్రాంతంలో పీ4 కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆర్డిఓ శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద జరుగుతున్న పనులు పరిశీలించి అధికారులకు ఆమె సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, డీఎస్పీ పాల్గొన్నారు.

News March 23, 2025

సంగారెడ్డి: జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు విడుదల

image

జిల్లాలో ఆదివారం అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రత వివరాలను అధికారులు ప్రకటించారు. అత్యధికంగా వట్పల్లిలో 37.7, పాల్వంచలో 37.6, ఆందోలు మండలం అల్మాయిపేట 36.9, కల్హేర్‌లో 36.7, ఆందోలు మండలం అన్నాసాగర్‌లో 36.6, నారాయణఖేడ్ లో 36.4, జహీరాబాద్ మండలం అల్గోల్‌లో 36.2, చౌటకూర్, కందిలలో 36.1, నిజాంపేట, కోహీర్ మండలం దిగ్వల్, కొండాపూర్, పుల్కల్ లలో 36.0 ఉష్ణోగ్రత నమోదైనట్లు వివరించారు.

News March 23, 2025

నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

image

☞ నంద్యాలలో వార్డెన్ పై పోక్సో కేసు నమోదు
☞ శ్రీశైలంలో ఉగాది ప్రత్యేకతపై Way2 News ఫోకస్
☞ ఎర్ర బంగారంపై వర్ష ప్రభావం
☞ శ్రీశైలంలోని కృష్ణా నదిలో మునిగి యువకుడి మృతి
☞ నల్లమల్ల అడవుల్లో కన్నడ భక్తుల సందడి
☞ కొణిదెల గ్రామానికి రూ.50 లక్షలు: పవన్ కళ్యాణ్
☞ ఆళ్లగడ్డలో కిలో చికెన్ ధర రూ.90
☞ స్థల వివాదంతోనే సుధాకర్ రెడ్డి హత్య: బండి ఆత్మకూరు ఎస్ఐ
☞ PGRS వేళలో మార్పులు: కలెక్టర్

error: Content is protected !!