News August 27, 2024

అనకాపల్లి జిల్లాలో హత్య 

image

అన్నదమ్ముల మధ్య జరిగిన తగాదాలో చిన్నాన్నను హత్యచేసిన ఘటన మాకవరపాలెం మండలంలోని తాడపాలలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గనిశెట్టి జోగులు(72) అన్న కొడుకులు భాస్కరరావు, దొరబాబు సోమవారం రాత్రి స్థల వివాదమై గొడవపడ్డారు. దీంతో జోగునాయుడు మధ్యలోకి వెళ్లడంతో దొరబాబు కత్తితో పొడిచి హత్యచేశాడు. పాత తగాదాల నేపథ్యంలో హత్య జరిగినట్టు సమాచారం. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 22, 2025

ఈనెల 29 నుంచి నవోదయం: మంత్రి కొల్లు

image

పెందుర్తిలోని జెర్రిపోతులపాలెంలో మద్యం డిపోను ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం పరిశీలించారు. ఈనెల 29 నుంచి రాష్ట్రంలో నవోదయం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో నాటు సారా లేకుండా చేసి చూపిస్తామన్నారు. ఎవరైనా, ఎక్కడైనా కల్తీ సారా అమ్మినట్లు తెలిసినా, గంజాయి సాగు, రవాణాకు పాల్పడినా ఉపేక్షించేది లేదన్నారు. ఆయనతోపాటు స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు ఉన్నారు.

News January 21, 2025

విశాఖలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం

image

విశాఖలోని పీఎం పాలెం పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. HPCL లేఔట్‌లోని ఓ ఇంటిలో బాలికపై అత్యాచారం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. 15 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసినట్లు ఆమె తల్లి పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నల్ల సాయితేజను అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తామని సీఐ పేర్కొన్నారు.

News January 21, 2025

ఏయూలో జపనీస్ భాషలో డిప్లొమా కోర్సు

image

విద్యార్థులు, భాషా ఔత్సాహికులకు ఉత్తేజకరమైన పరిణామంలో ఏయూ జపనీస్ భాషలో డిప్లొమా కోర్సులో ప్రవేశాలను ప్రారంభించింది. విదేశీ భాషల విభాగాధిపతి, జపాన్ సమాచార అధ్యయన కేంద్రం డైరెక్టర్ చల్లా రామకృష్ణ నేతృత్వంలోని ప్రారంభించింది. ఆసక్తిగల విద్యార్థులు ఏయూ అడ్మిషన్స్ డైరెక్టర్ లేదా ఏయూ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విభాగాన్ని సంప్రదించాలని సూచించారు. 40సీట్లు ఉంటాయి. ఆరునెలల సాయంత్రం తరగతులు నిర్వహిస్తారు.