News March 10, 2025
అనకాపల్లి జిల్లాలో 260 మంది గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు ఇంటర్మీడియట్ అనకాపల్లి జిల్లా అధికారిణి సుజాత తెలిపారు. సోమవారం జరిగిన పరీక్షకు 260 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు పేర్కొన్నారు. మొత్తం 11,313 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 11,053 మంది విద్యార్థులు హాజరైనట్లు వెల్లడించారు.
Similar News
News March 10, 2025
ఖమ్మం: లోక్‌సభలో ఎంపీ రఘురామ అభ్యర్థన

377 నిబంధన కింద తెలంగాణలో ఆయిల్ పామ్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఖమ్మం ఎంపీరఘురాం రెడ్డి సోమవారం లోక్‌సభలో కోరారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తృతంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపడుతోందన్నారు. ఆయిల్ పామ్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా మార్చడం, జాతీయ ఆహార చమురు సరఫరాలో గణనీయంగా దోహదపడతామన్నారు.
News March 10, 2025
విశాఖలో ‘హయగ్రీవ’ భూములు వెనక్కి

AP: విశాఖలో హయగ్రీవ ఫార్మ్ అండ్ డెవలపర్స్‌కు ఇచ్చిన 12.41 ఎకరాల భూ కేటాయింపును ప్రభుత్వం రద్దు చేసింది. నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుపుతూ సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే భూమిని స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించింది. అటు అమరావతిలోనూ 13 సంస్థల భూ కేటాయింపులను రద్దు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ <<15713685>>నిర్ణయించిన<<>> విషయం తెలిసిందే.
News March 10, 2025
మరో అమ్మాయితో చాహల్.. ధనశ్రీ సంచలన పోస్ట్

టీమ్ ఇండియా క్రికెటర్ చాహల్ భార్య ధనశ్రీ ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘మహిళను బ్లేమ్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చాహల్, ధనశ్రీ విడాకులు తీసుకున్నట్లు కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. దీంతో SMలో తనపై వచ్చిన కామెంట్స్‌పై ధనశ్రీ ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. అటు నిన్న CT ఫైనల్ మ్యాచ్‌కు <<15704215>>చాహల్<<>> మరో అమ్మాయితో కలిసి వెళ్లిన వీడియోలు వైరల్ అయ్యాయి.