News February 27, 2025

అనకాపల్లి జిల్లాలో 71.20 శాతం పోలింగ్ నమోదు

image

అనకాపల్లి జిల్లాలో మధ్యాహ్నం 12.00 గంటల వరకు 71.20 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా అధికారులు తెలిపారు. దేవరాపల్లిలో 63.49 శాతం, చీడికాడలో 71.74 శాతం, మాడుగులలో60 శాతం, గొలుగొండలో 62.20, రోలుగుంటలో 64.58, రావికమతంలో 57.69, బుచ్చయ్యపేటలో 73.53 శాతం నమోదయింది. అలాగే చోడవరంలో 66.67, కె.కోటపాడులో 75.70, నర్సీపట్నంలో 75.98, నాతవరంలో 80.28, కోటవురట్లలో72.84, మాకవరపాలెంలో 71.70 శాతం నమోదయింది.

Similar News

News November 6, 2025

కార్తీక పౌర్ణమి వేడుకలు ప్రారంభించిన సిరిసిల్ల కలెక్టర్

image

కార్తీక పౌర్ణమి వేడుకల సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో లక్ష దీపాలతో సామూహిక దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. జిల్లా ఎస్పీ మహేశ్ బి గితే, వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, ఆర్డీవో రాధాబాయి, ఆలయ ఈవో రమాదేవి తదితరులు పాల్గొని భక్తులకు బహుమతులను అందజేశారు.

News November 6, 2025

సిరిసిల్ల విద్యార్థినికి గోల్డ్ మెడల్

image

సిరిసిల్ల పట్టణానికి చెందిన కొంపల్లి వీణ ఎమ్మెస్సీ (మ్యాథమెటిక్స్) విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. 2022- 2023 సంవత్సరం బ్యాచ్‌లో అత్యధిక మార్కులు సాధించిన కొంపల్లి వీణ బంగారు పతకానికి ఎంపికైందని శాతవాహన విశ్వవిద్యాలయం ప్రకటించింది. నవంబర్ 7న జరిగే స్నాతకోత్సవంలో వీణకు బంగారు పతకాన్ని అందజేయనున్నారు. బంగారం పతకం సాధించిన వీణను వికాస్ కళాశాల అధ్యాపకులు అభినందించారు.

News November 6, 2025

విశాఖ: 17 నుంచి 30వ తేదీ వరకు కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే

image

శరీరంపై స్పర్శ లేని మచ్చలు ఉంటే వైద్య సిబ్బందికి తెలియజేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ బుధవారం విజ్ఞప్తి చేశారు. విశాఖలో నవంబర్ 17 నుంచి 30 వరకు కుష్టు వ్యాధి గుర్తింపు కార్యక్రమం (LCDC) పటిష్టంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తారని, ప్రాథమిక దశలో గుర్తిస్తే అంగవైకల్యం రాకుండా నివారించవచ్చు అన్నారు.