News April 1, 2025

అనకాపల్లి జిల్లాలో 93.24 శాతం పింఛన్ల పంపిణీ 

image

అనకాపల్లి జిల్లాలో మధ్యాహ్నం మూడు గంటల వరకు 93.24 శాతం పింఛన్లను పంపిణీ చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. సబ్బవరం మండలంలో 97.29 శాతం, కె.కోటపాడులో96.56 శాతం,కశింకోటలో 95.63 శాతం, మునగపాక 95.57 శాతం, నర్సీపట్నం 95.33 శాతం,దేవరాపల్లి 95.23 శాతం పంపిణీ చేసినట్లు తెలిపారు.అలాగే‌ చీడికాడ 95.14 శాతం,చోడవరం 94.96 శాతం,అనకాపల్లి 87.94 శాతం,యలమంచిలి 94.73 శాతం పించన్లను పంపిణీ చేసినట్లు తెలిపారు.

Similar News

News November 26, 2025

ప్రీ డయాబెటీస్‌ని ఎలా గుర్తించాలంటే?

image

ప్రీ డ‌యాబెటిస్ అంటే డ‌యాబెటిస్ రావ‌డానికి ముందు స్టేజి. వీరిలో ర‌క్తంలో చక్కెర స్థాయిలు ఉండాల్సినదాని కన్నా కాస్త ఎక్కువ‌గా ఉంటాయి. ఈ స్టేజిలో జాగ్రత్తలు తీసుకోకపోతే డ‌యాబెటిస్ స్టేజిలోకి వెళ్తారు. వీరికి మందులు ఇవ్వకుండా ముందు డైట్ పాటించాల‌ని, వ్యాయామం చేయాల‌ని వైద్యులు సూచిస్తారు. ప్రీ డయాబెటీస్ ఉన్న కొందరికి షుగర్ లక్షణాలుంటాయి. కానీ 35 ఏళ్లు దాటాక అందరూ షుగర్ టెస్టులు చేయించుకోవడం మంచిది.

News November 26, 2025

బెండ, టమాటా, వంగలో వైరస్ తెగుళ్ల నివారణ

image

కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల వ్యాప్తిని అరికట్టేందుకు రసం పీల్చే పురుగులను నివారించాలి. ఇందుకోసం ఫాసలోన్ లేదా ఫిప్రోనిల్ మందులను లీటరు నీటికి 2ML చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తెల్ల దోమ నివారణకు 1.5గ్రా. ఎసిఫేట్‌ను లీటరు నీటికి కలిపి, కాయతొలుచు పురుగు నివారణకు 2ML ప్రొఫెనోఫాస్ లీటరు నీటికి కలిపి స్ప్రే చేయాలి. అలాగే అధికారుల సిఫారసు మేరకు నత్రజని ఎరువులను వేసుకుని నీరు పెట్టుకోవాలి.

News November 26, 2025

MBNR: పోలీస్ కార్యాలయంలో రాజ్యాంగ ప్రతిజ్ఞ

image

మహబూబ్‌ నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈ రోజు రాజ్యాంగ ప్రతిజ్ఞ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి. జానకి మాట్లాడుతూ.. దేశ రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛలు కల్పించడమే కాకుండా ప్రభుత్వ వ్యవస్థలపై ముఖ్యమైన బాధ్యతలు కూడా ఉంచిందని, పోలీసు శాఖ ప్రజల హక్కులను కాపాడుతూ, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సేవలందించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.