News March 1, 2025
అనకాపల్లి జిల్లాలో 93.61 శాతం పింఛన్ల పంపిణీ

అనకాపల్లి జిల్లాలో శనివారం సాయంత్రం వరకు 93.61 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేసినట్లు డీఆర్డీఏ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం కింద 2,56,274 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 2,39,892 మందికి పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీలో సబ్బవరం మండలం మొదటి స్థానంలో ఉండగా పాయకరావుపేట చివరి స్థానంలో ఉంది.
Similar News
News March 18, 2025
అత్యాచారం కేసులో పేరుసోమల వ్యక్తికి జీవిత ఖైదు

అత్యాచారం కేసులో నంద్యాల జిల్లా వ్యక్తికి జీవిత ఖైదు శిక్ష పడింది. సంజామల మండలం పేరుసోమలకు చెందిన ఉప్పు నాగహరికృష్ణ 2020లో తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లాకు చెందిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదైంది. విచారణలో నేరం రుజువు కావడంతో హరికృష్ణకు జీవిత ఖైదు, రూ.10వేల జరిమానా విధిస్తూ కర్నూలు జిల్లా మహిళా కోర్టు జడ్జి వి.లక్ష్మీరాజ్యం తీర్పు చెప్పారు.
News March 18, 2025
ఇటలీలో సిరిసిల్ల జిల్లా వ్యక్తి మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వ్యక్తి ఇటలీలో రోడ్డు ప్రమాదంలో 15 రోజుల క్రితం మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎల్లారెడ్డిపేటకు చెందిన మహమ్మద్ రషీద్ (47) ఇటలీలో లారీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రోడ్డు దాటుతున్న క్రమంలో వేరే వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహం రెండు రోజుల్లో స్వగ్రామం రానుంది.
News March 18, 2025
చొప్పదండి: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా ఎంపిక

చొప్పదండికి చెందిన మంచికట్ల కుమార్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కాగా కుమార్ తండ్రి మంచికట్ల విట్టల్.. ఫుట్‌వేర్ షాప్ నడిపిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. కుమార్ మాట్లాడుతూ.. తన తండ్రి కష్టపడి చదివించారని, తన ఆశయాలను వమ్ము చేయకుండా కృషి, పట్టుదలతో చదివానని ఈసందర్భంగా పేర్కొన్నాడు. కుమార్‌ను పద్మశాలి సంఘం అధ్యక్షుడు దండే రాజయ్య, దండే లింగన్న, దూసరాము అభినందించారు.