News February 2, 2025
అనకాపల్లి జిల్లాలో 94.79 శాతం పెన్షన్ పంపిణీ పూర్తి

అనకాపల్లి జిల్లాలో శనివారం రాత్రి 7.10 గంటల వరకు 94.79 శాతం పెన్షన్లు పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ అధికారులు తెలిపారు. పెన్షన్ పంపిణీలో సబ్బవరం మండలం మొదటి స్థానంలో నిలిచిందన్నారు. మండలంలో 97.94 శాతం మందికి పెన్షన్ అందజేశామన్నారు. రెండో స్థానంలో చోడవరం, 3వ స్థానంలో కసింకోట, 4వ స్థానంలో నర్సీపట్నం ఉన్నాయన్నారు. మిగిలిపోయిన వారికి ఈనెల 3వ తేదీన పెన్షన్ పంపిణీ చేస్తామన్నారు.
Similar News
News January 10, 2026
తమీమ్-బీసీబీ మధ్య మాటల యుద్ధం

T20 వరల్డ్ కప్ భారత్లో కాకుండా న్యూట్రల్ వేదికల్లో పెట్టాలంటూ <<18761652>>BCB<<>> కోరిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ అంశం బంగ్లాదేశ్ క్రికెట్లో తీవ్ర వివాదానికి దారి తీసింది. ‘మనకు ఎక్కువ ఆదాయం ICC నుంచే వస్తోంది కాబట్టి భవిష్యత్ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి’ అని బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ సూచించారు. దీనిపై బీసీబీ సభ్యుడు నజ్ముల్ ఇస్లాం తమీమ్ “ఇండియన్ ఏజెంట్” అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
News January 10, 2026
రాష్ట్రంలోనే అత్యుత్తమ స్టేషన్గా పెద్దకడబూరు పీఎస్

పెద్దకడుబూరు పోలీస్స్టేషన్ రాష్ట్రంలోనే అత్యుత్తమ స్టేషన్గా ఎంపికైంది. శుక్రవారం మంగళగిరిలో డీజీపీ హారీశ్ కుమార్ గుప్తా నుంచి డీఐజీ విక్రాంత్ పాటిల్, డీఎస్పీ భార్గవి, ఎస్ఐ నిరంజన్ రెడ్డి ‘సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీ’ అవార్డు అందుకున్నారు. నేర నియంత్రణ, సీసీ కెమెరాల ఏర్పాటు, కేసుల సత్వర పరిష్కారంలో చూపిన ప్రతిభకు కేంద్ర హోం శాఖ ఈ గుర్తింపునిచ్చింది. ఈ ఘనత జిల్లాకే గర్వకారణమని డీఐజీ పేర్కొన్నారు.
News January 10, 2026
ఈనెల 13న హనుమకొండలో ఉద్యోగ మేళా

ఉమ్మడి జిల్లా నిరుద్యోగ యువత ఉపాధి కల్పన కోసం ఈనెల 13న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనా శాఖ అధికారి బి.సాత్విక తెలిపారు. సుమారు 75 ప్రైవేట్ ఉద్యోగాల కోసం టెన్త్, ఇంటర్, డిగ్రీ ఆపై చదివిన 21 నుంచి 45 ఏళ్ల యువత అర్హులని అన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు అర్హత ధృవపత్రాలతో ములుగు రోడ్డు వద్ద గల తమ కార్యాలయంలో జరుగే మేళాకు హాజరు కావాలన్నారు.


