News February 2, 2025

అనకాపల్లి జిల్లాలో 94.79 శాతం పెన్షన్‌ పంపిణీ పూర్తి

image

అనకాపల్లి జిల్లాలో శనివారం రాత్రి 7.10 గంటల వరకు 94.79 శాతం పెన్షన్‌లు పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ అధికారులు తెలిపారు. పెన్షన్ పంపిణీలో సబ్బవరం మండలం మొదటి స్థానంలో నిలిచిందన్నారు. మండలంలో 97.94 శాతం మందికి పెన్షన్ అందజేశామన్నారు. రెండో స్థానంలో చోడవరం, 3వ స్థానంలో కసింకోట, 4వ స్థానంలో నర్సీపట్నం ఉన్నాయన్నారు. మిగిలిపోయిన వారికి ఈనెల 3వ తేదీన పెన్షన్ పంపిణీ చేస్తామన్నారు.

Similar News

News February 7, 2025

సిరిసిల్ల: కుక్కల వల్ల చిన్నారికి సోకిన వైరస్

image

కోనరావుపేట(M) కనగర్తికి చెందిన చేపూరి శ్రీమేధ(4) అనే చిన్నారికి జ్వరంతో పాటు శరీరంపై అలర్జీ ఏర్పడింది. అవి ఎక్కువ కావడంతో చిన్నారిని సిరిసిల్లలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అన్నిరకాల పరీక్షలు చేసినా నిర్ధారణ కాకపోవడంతో 4రోజుల క్రితం HYDలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్రూసెల్లా ఇథి పీకల్ వైరస్ గా గుర్తించారు. కుక్కల కారణంగా ఈ వైరస్ సోకినట్టు వైద్యులు తెలిపారు.

News February 7, 2025

గుంటూరు: కూతురి పట్ల అసభ్య ప్రవర్తన.. తండ్రిపై దాడి

image

కూతురిని అసభ్యకరంగా దూషించి ఆమె తండ్రిపై దాడి చేసిన ముగ్గురు యువకులపై పట్టాభిపురం పీఎస్‌లో కేసు నమోదైంది. విద్యానగర్ 1వ లైన్ శివారు మార్గం ద్వారా ఒక వ్యక్తి తమ కుమార్తె వాహనంపై వస్తున్నారు. ఈ క్రమంలో మద్యం సేవించిన యువకులు అతని కుమార్తెను దూషించారు. అనంతరం ఆమె తండ్రి ఆ యువకులను మందలించడంతో మద్యం సీసాతో దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

News February 7, 2025

లింగంపాలెం: వ్యక్తి అనుమానాస్పద మృతి

image

లింగపాలెం మండలం కలరాయనగూడెం గ్రామంలో రామస్వామి (45) అనే వ్యక్తి గురువారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రామస్వామి చావుకి అదే గ్రామానికి చెందిన కొందరు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. లింగపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!