News April 2, 2025
అనకాపల్లి జిల్లాలో 94.87 పెన్షన్ల పంపిణీ పూర్తి

అనకాపల్లి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద మంగళవారం 94.87 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేసినట్లు డీఆర్డీఏ పీడీ శచీదేవి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2,56,072 మందికి పెన్షన్ పంపిణీకి రూ.108 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. సచివాలయం సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 2,43,580 మంది లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును అందజేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 5వ తేదీ వరకు పంపిణీకి అవకాశం ఉందన్నారు.
Similar News
News November 21, 2025
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి: ఎస్పీ

ప్రజలకు పోలీసు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కే నారాయణరెడ్డి అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి, వివిధ పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో సబ్-డివిజన్ల పోలీస్ అధికారులు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
News November 21, 2025
నీటి నిల్వ, సంరక్షణ చర్యలను మెచ్చిన కేంద్రం

AP: రాష్ట్రవ్యాప్తంగా డి.సీఎం పవన్ నేతృత్వంలో నీటి నిల్వ, సంరక్షణ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్రం గుర్తించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖకు జల్ శక్తి అవార్డులు వరించాయి. పంచాయతీ క్యాటగిరీలో ప్రథమ స్థానంలో మదనపల్లి మండలం, దుబ్బిగానిపల్లె, ద్వితీయ స్థానంలో ప్రకాశం(జి), పీసీ పల్లె(మం) మురుగమ్మి గ్రామం, జల్ సంచయ్-జన్ భాగీదారీలో దక్షిణ జోన్లో నెల్లూరు జిల్లాకు అవార్డు దక్కింది.
News November 21, 2025
‘వస్త్ర పరిశ్రమ సాధికారత.. మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక’

ఇందిరా మహిళ చీరల ఉత్పత్తి ఆర్డర్లతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సాధికారతకు ఉపయోగపడుతుందని, మహిళల ఆత్మగౌరవానికి తోడ్పడుతుందని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన మహిళలకు అందజేసే చీరలు జిల్లాలో ఉత్పత్తి కావడం ఎంతో సంతోషంగా ఉందని, 32 జిల్లాల నుంచి SHGల బాధ్యులు వచ్చి చీరల తయారీ విధానం, దశలు, రంగులు, నాణ్యతను చూసి ఆనందం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.


