News February 4, 2025
అనకాపల్లి జిల్లాలో 98.07 శాతం పింఛన్లు పంపిణీ

ఎన్టీఆర్ భరోసా పథకం కింద అనకాపల్లి జిల్లాలో సోమవారం సాయంత్రం 6.10 గంటల వరకు 98.07 పింఛన్లను పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో లబ్ధిదారులు 2,57,457 మంది కాగా ఇప్పటివరకు 2,52,482 మందికి పింఛన్లను అందజేసినట్లు పేర్కొన్నారు. ఇంకా 4,975 మందికి పింఛన్లు అందజేయాల్సి ఉందన్నారు.
Similar News
News January 16, 2026
ప్రజల నమ్మకానికి నిదర్శనం.. ముంబై రిజల్ట్స్‌పై అమిత్ షా

దేశం దృష్టిని ఆకర్షించిన BMC ఎన్నికల్లో BJP నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం దాదాపు ఖరారైంది. 227 వార్డులకుగానూ 129 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. 72 స్థానాలతో ఠాక్రే సోదరుల కూటమి తర్వాతి స్థానంలో ఉంది. కాంగ్రెస్ కేవలం 15 సీట్లలోనే ప్రభావం చూపుతోంది. NDA ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, విధానాలపై ప్రజలకున్న విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
News January 16, 2026
జగిత్యాల: ఈనెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ

జగిత్యాల జిల్లాలోని 13 మోడల్ స్కూళ్లలో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం ఈనెల 28 నుంచి వచ్చే నెల 28వ తేది వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఈవో రాము శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 19న నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News January 16, 2026
ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి: లోకేశ్

AP: రాష్ట్రానికి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి రానుందని మంత్రి లోకేశ్ ప్రకటించారు. ‘AM గ్రీన్’ కంపెనీ కాకినాడలో 1.5 మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఎక్స్‌పోర్ట్ టర్మినల్ ఏర్పాటు చేయబోతుందని, దీనివల్ల 8వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని ట్వీట్ చేశారు. ఇక్కడ ఉత్పత్తి అయిన అమ్మోనియాను జపాన్, జర్మనీ, సింగపూర్‌కు ఎగుమతి చేస్తారని పేర్కొన్నారు.


