News March 29, 2025
అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

➤లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ నక్కపల్లి RI
➤ చీడికాడలో 10th పరీక్షలను పరిశీలించిన డీఈవో
➤ ఏప్రిల్ 1న సాంఘిక శాస్త్రం పరీక్ష-DEO
➤ 31న అచ్చుతాపురం రానున్న మంత్రి లోకేష్
➤ రోడ్డు వేయాలంటూ 16 కి.మీ గిరిజనులు పాదయాత్ర
➤ బీసీ కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూలు
➤ నూకాంబిక జాతర ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే కొణతాల
Similar News
News December 1, 2025
ఆ వ్యాధి గురించి భయపడకండి: చిత్తూరు DMHO

చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు స్కబ్ టైపన్ కేసులు 149 నమోదయ్యాయని.. అందరూ కోలుకున్నారని DMHO సుధారాణి వెల్లడించారు. చిన్న నల్లి లాంటి ప్రాణి కుట్టడంతో ఈ వ్యాధి వస్తుందన్నారు. తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులు ఉంటాయని తెలిపారు. బురదలో నడిచినప్పుడు, పొలాల్లో చెప్పులు లేకుండా తిరిగినప్పుడు ఇవి కుడుతాయన్నారు. జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్ను సంప్రదిస్తే యాంటి బయోటిక్స్ ద్వారా నయమవుతుందని స్పష్టం చేశారు.
News December 1, 2025
ప్రొద్దుటూరు: చిన్నోడే పెద్ద పోరాటం!

ప్రొద్దుటూరుకు చెందిన 6వ తరగతి విద్యార్థి ఎబినేజర్ ధైర్యసాహసాలు మెచ్చుకోవాల్సిందే. కాలువకు రక్షణ గోడలేక తన స్నేహితుడు కిందపడ్డాడని బాలుడు జీర్ణించుకోలేకపోయాడు. ఇలా మరొకరు ఇబ్బంది చెందకూడదని పోరాటానికి దిగాడు. కాలువకు వెంటనే రక్షణ గోడ నిర్మించాలని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డికి విన్నవించాడు. త్వరగా రక్షణగోడ నిర్మించకపోతే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని ఆ కుర్రాడు హెచ్చరించాడు.
News December 1, 2025
ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకే రుణాలివ్వాలి: CM

TG: ఫ్యూచర్ సిటీ, మెట్రోరైల్ విస్తరణ, RRR, రేడియల్ రోడ్ల నిర్మాణాలకు తక్కువ వడ్డీకే రుణాలివ్వాలని CM రేవంత్ హడ్కో ఛైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠను కోరారు. అత్యధిక వడ్డీతో ఇచ్చిన లోన్లను రీకన్స్ట్రక్షన్ చేయాలన్నారు. మరో 10L ఇళ్ల నిర్మాణానికి రుణాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై హడ్కో ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు. గ్రీన్ఫీల్డ్ రోడ్లు, బుల్లెట్ ట్రైన్ అంశాలపైనా వారు చర్చించారు.


