News February 19, 2025
అనకాపల్లి జిల్లా టాప్ న్యూస్

* తంగుడుబిల్లిలో కోడి పందేల శిబిరంపై దాడులు *రావికమతం: సర్వే స్కెచ్ ఫోర్జరీ.. ఇద్దరిపై కేసుకు సిఫార్సు *అనకాపల్లి మండలంలో గ్రావెల్ లారీ సీజ్ * ఉపమాక: 24న వెంకన్న పెండ్లిరాట మహోత్సవం * నర్సీపట్నం: గంజాయితో ముగ్గురి అరెస్ట్ *వేచలంలో 23న సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ * ఎలమంచిలి: సర్వర్ పనిచేయక అవస్థలు * ఏపీకి కేంద్రం అత్యధిక నిధుల విడుదల: హోంమంత్రి అనిత
Similar News
News December 8, 2025
సంగారెడ్డి: ఒక్క సర్పంచికి కాంగ్రెస్ నుంచి 9 నామినేషన్లు

నాగల్ గిద్ద మండల కేంద్రంలో సర్పంచి పదవికి ఏకంగా 11 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఒక్కొక్కరు ఉండగా, గ్రూపు రాజకీయాల కారణంగా కాంగ్రెస్ నుంచి ఏకంగా 9 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత తుది బరిలో ఎంతమంది ఉంటారో తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ గుంపు రాజకీయాలు మొదలైనట్లు తెలుస్తోంది.
News December 8, 2025
అరుదైన ఘట్టంలో గోదావరోళ్ల సంతకం..!

స్వాతంత్ర్య భారత గతిని మార్చిన రాజ్యాంగ సభ తొలి సమావేశం (1946 డిసెంబర్ 8)లో తూ.గో తేజాలు ప్రకాశించించాయి. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ చారిత్రక ఘట్టంలో జిల్లాకు చెందిన దిగ్గజ నేతలు కళా వెంకటరావు, మొసలికంటి తిరుమలరావు పాల్గొని రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. భావి భారత పౌరుల భవిష్యత్తును తీర్చిదిద్దిన ఆ బృహత్తర క్రతువులో గోదావరి బిడ్డలు భాగస్వాములు కావడం జిల్లా ప్రజలకు ఎప్పటికీ గర్వకారణమే.
News December 8, 2025
చీరాలలో అన్నదమ్ములు అరెస్ట్..!

చీరాలకు చెందిన అన్నదమ్ములు దాసరి గోపి (32), దుర్గ (24)ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. బాపట్ల SP ఉమామహేశ్వర్ వివరాల మేరకు.. చీపుర్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్న వారు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. 6 నెలలుగా జిల్లాలో బైక్లను దొంగిలిస్తున్నారు. చీరాల 1టౌన్ పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 4 బైక్లను దొంగలించినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఇన్స్పెక్టర్ సుబ్బారావుకు రివార్డ్ అందించారు.


