News February 19, 2025

అనకాపల్లి జిల్లా టాప్ న్యూస్

image

* తంగుడుబిల్లిలో కోడి పందేల శిబిరంపై దాడులు *రావికమతం: సర్వే స్కెచ్ ఫోర్జరీ.. ఇద్దరిపై కేసుకు సిఫార్సు *అనకాపల్లి మండలంలో గ్రావెల్ లారీ సీజ్ * ఉపమాక: 24న వెంకన్న పెండ్లిరాట మహోత్సవం * నర్సీపట్నం: గంజాయితో ముగ్గురి అరెస్ట్ *వేచలంలో 23న సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ * ఎలమంచిలి: సర్వర్ పనిచేయక అవస్థలు * ఏపీకి కేంద్రం అత్యధిక నిధుల విడుదల: హోంమంత్రి అనిత

Similar News

News July 8, 2025

చర్చకు రాకుంటే కేసీఆర్‌కు క్షమాపణ చెప్పు: KTR

image

TG: సీఎం రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదని, తాము సరిపోతామని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. ‘రేవంత్.. నిజాయితీ, నిబద్ధత ఉంటే చర్చకు రా. లేకపోతే తప్పుడు కూతలు కూసినందుకు, మహా నాయకుడిపై అడ్డగోలుగా మాట్లాడినందుకు ముక్కు నేలకు రాసి KCRకు క్షమాపణలు చెప్పు. చర్చ కోసం రేవంత్ ఎక్కడికి రమ్మన్నా వస్తా. చర్చకు సత్తా లేకపోతే సవాళ్లు చేయొద్దు. సీఎంకు వాతలు పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని ఫైరయ్యారు.

News July 8, 2025

నేను బాగున్న.. దేశం కోసం పోరాడు: ఆకాశ్ సోదరి

image

తన సోదరి క్యాన్సర్‌తో బాధపడుతున్నారని భారత ప్లేయర్ ఆకాశ్ దీప్ <<16971842>>ఎమోషనల్ <<>>అయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయన సోదరి మీడియాతో మాట్లాడారు. ‘నేను బాగున్నానని, దేశానికి మంచి చేయడంపై దృష్టి పెట్టాలని ఇంగ్లండ్‌కు వెళ్లేముందు ఆకాశ్‌తో చెప్పా. ఆకాశ్ నా గురించి బహిరంగంగా మాట్లాడతారని నాకు తెలియదు. మేము దీన్ని ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడలేదు. కానీ అతను ఎమోషనలై ఈ విషయాన్ని చెప్పాడు’ అని తెలిపారు.

News July 8, 2025

MHBD: RMP వైద్యం వికటించి బాలుడు మృతి!

image

కేసముద్రం మండలం బావుజీ తండాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. RMP చేసిన వైద్యం వికటించి తమ కుమారుడు చరణ్ (15) మృతి చెందాడని ధరావత్ బాలోజీ, అనితా దంపతులు ఆరోపించారు. కడుపునొప్పితో RMP దగ్గరకు వెళ్తే రెండు ఇంజక్షన్లు, మూడు టాబ్లెట్స్ ఇచ్చారని తెలిపారు. కాసేపటికి బాలుడు మృతిచెందినట్లు చెప్పారు. తమకు న్యాయం చేయాలని వారు ఆందోళన చేస్తున్నారు.